పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము

11


నానాశాస్త్రవచో విచారపరతన్ వాదించుచోఁ గిర సం
తానంబున్, వరశారికాప్రకట విద్యాసూక్తి, నిస్పంశయా
ధీనస్వాంతములై ముదం బెదల సంధిల్లంగ వర్తించు ల
క్మీనారాయణ పండితోత్తముల సచ్చిష్యాగ్రహారంబులన్. 44

కణభుగ్వాగ్విభవంబుఁ గొల్లగొని సాక్షాదక్షపాదోక్త ల
క్షణ మెల్లన్ దనసొమ్ముఁ జేసికొని వ్యాసప్రోక్త భాషావళిన్
గణన ప్రాప్త సమస్త వర్ణచయముల్‌గాఁగల్గి వర్తించి స
ద్గుణ రత్నాకరుఁడై యనంత సచివేంద్రుం డొప్పు భాగ్యోన్నతిన్‌. 45

తన దాన మల వనావనదేవ జానూన
             సితభాను శరధుల సిగ్గుపరుప
తననీతి మను జాతి ఘనభీతి దమ హేతి
            ధరురీతి వరభూతిఁ దాల్బుచుండ
................................................................
            .....................................................
తనధైర్య మనివార్యతరచర్య సదహార్య
            మదహస్తి చలదాప్తి మలయుచుండ

తన దయారస మసమాన జన మనోభి
మత హితార్థ ప్రదాయక స్థితి నెసంగ
తనరు నీ కొప్పరాజనంతయ్య మంత్రి
మంత్రి మాత్రుండె దేవతా మంత్రి నిభుఁడు. 46

కలిమి కులంబు, పుణ్యముల గాదిలిచుట్టము, నీతిపెంపు వి
ద్యలగని, కీర్తిరాశి, వినయంబులలోగిలి, మేలుకుప్ప, సొం
పుల తొలిపంట, ధర్మముల పుట్టువు, దిట్టతనంబు చక్కి, య
క్కులపతి నెన్నఁగాఁదరమె కుండలిభర్తకునైన ధారుణిన్. 47