పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము


అతని దానాంబువు లర్థి సంపద్గతి
             కతి నిధానంబులై యతిశయిల్లు
అతని లావణ్యంబు హరిణేక్షణావళి
             కతను లావణ్యంబు గతి దలిర్ప
అతని యుక్తులు సజ్జనావన సత్క్రియా
             యత నియుక్తిని పెంపు నందియుండ
నతని మానసపద్మ మభవ హంసోత్తమా
             యతన మానస పద్మ మగుచు నెగడ

నిరుపమాత్మబోధ నిగమవాక్యవిదుండు
కొప్పరాజనంత కోవిదుండు
ఘనత న మ్మహాత్ముఁ గొనియాడ శక్యంబె
నలువకైన నతని చెలువకై న. 48

బాలేమర్తి పురాన్వవాయ జలధి ప్రాలేయ భానుండు వి
ద్యాలంకారుఁడు పానక ప్రభుఁడు ప్రోద్యత్ప్రీతి వేంకాంబికా
బాలారత్నమునందుఁ గాంచిన సుతన్ భామాభిధానన్ సతీ
శీలన్ వేడ్క ననంతమంత్రి వరుసన్ శ్రీయుక్తితోఁ బెండ్లియై. 49

పంచపాది:

సతత దిశాభిశోభిత విశాల యశోభర సాధులోక స
న్నుతుఁడయి వేడ్క మువ్వురఁ దనూజులఁ గాంచె శంశాంక శేఖరా
ద్భుత పదభక్తి సంజనిత భూరి కవిత్వ లసద్వచః సము
న్నతమతి లింగనాఖ్యు భువవస్తుతశేషు నశేష వుణ్యు నా
శ్రిత హితవృత్తియైన నరసింహుని సత్యదయాభిరాముఁడై.‌ 50

వారిలోన. 51