పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము

9


సత్కళామహిమకుఁ జంద్రు దీటనవచ్చు
             తతకళంకము మేన దాల్పకున్న

ననుచుఁ గొనియాడుదురు మాళవాంగ వంగ
కుకురు కురు కాశ గాంధార కోసలాంధ్ర
పాండ్య కేరళ చోళ భూపాలసభల
నన్నయామాత్య నరసింహు ననుదినంబు. 36

జలజాస్త్ర బాణపంచకమని యనిశంబు
            మత్తకాశినులెల్ల మదిఁ దలంపఁ
కల్పభూరుహపంచకంబని సతతంబు
            యాచకావళులెల్లు నాశ్రయింప
శంకరు వక్త్రపంచకమని నిత్యంబు
            శైవసంఘంబెల్ల సన్నుతింప
పద్మాక్షు నాయుధ పంచకంబని యెప్డు
           ధృతిమాని రిపులెల్ల నతి భజింపఁ

జెలగు నుతపంచకంబు నృసింహమంత్రి
కాంచె సిరిపుర సత్కుల కలశవార్థి
లక్ష్మి యన మించి విలసిల్లు లచ్చమాంబి
కా సతీరత్న మందు వికాసమొదవ. 37

దానానూనయశుండు వీరవరుఁ డుద్దామప్రభావుండు యో
గానందుం డనఘుండు గోప సచివాధ్యక్షుండు ధీశాలి ల
క్ష్మీనారాయణ మంత్రి సద్గుణగణగశ్రీకుం డనంతార్యుఁ డా
ర్యానందైక ధురీణు లేవురు సురాహార్యోరు ధైర్యోన్నతుల్‌. 38

తత్క్రమంబున 39