పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము


పత్రికోదార లేఖనమాత్ర ఘటిత
సకల దిగ్భ్రాజమాన రాజన్య శౌర్య
నిర్వహణ దివ్య పాండిత్య నీతిశాలి
మహితరుచిహేళి యన్నయామాత్యమౌళి. 31

వారిలోన- 32

సకలక్షోణిపతుల్‌ నుతింపఁగ శిలాస్తంభంబుపై 'నేలుచూ
రి' కడన్ వ్రాసిన యన్నపార్యుని సుకీర్తి స్వచ్ఛపద్యాళిఁ దా
రకలంకస్థితి రేపు మాపు నరసింహస్వామి పాదాబ్జ సే
వకు లేతెంచి సురల్‌ పఠింతు రొగి భావంబందు హర్షింపుచున్. 33

ఆ యన్నపార్యుఁ డలఘు స
హోయుఁ డనంతమ్మయందు హరి సిరియందున్‌
గాయజుఁ గన్న విధంబున
ధీయుతు నరసింహ నామధేయుం గనియెన్. 34

మిన్నున నున్న సౌరికరి మీఁదికి సింహములట్ల మీఱి య
త్యున్నత తారకాద్రిపయి నుజ్జ్వల శంబనిభప్రభావ సం
పన్నములై గడంగి భువి భవ్యరతి న్నుతిఁ గాంచె కొప్పరా
జన్నయ నారసింహ సచివాగ్రణి నవ్యయశోవిలాసముల్‌. 35

ధైర్యంబునకు మేరుధరము దీటనవచ్చు
              వరధర్మగతియందు వంగకున్న
నలఘు గంభీరత నబ్ధి దీటనవచ్చు
              నమిత భంగంబుల నందకున్న
దాతృత్వమున కంబుదంబు దీటనవచ్చు
              జీవనస్ఫురణ గర్జింపకున్న