పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

నేనును పది పండ్రెండేండ్లు దాని ప్రస్తావనయేలేక యొకసారి వేసవి సెలవులలో జూడ నారంభించి యున్నంతవఱకు జాగ్రత్తగా నొక 'కాపీని’ వ్రాసి దానిలో సవరణల కారంభించి యెట్లో సంవత్సరమున్నఱ కొక పద్ధతిలోనికిఁ దెచ్చితివి. ఒకనాఁడు దానిని మహానందముతోఁగొని నా కాశ్రయులైన నర్సరావుపేట జమీం చారు మ. రా, రా. శ్రీ మల్రాజు వేంకట రామకృష్ణ కొండల్రావు బహద్దరు గారిని సమీపించి, గ్రంథ విషయము సర్వమును నివేదించి యెట్లయిన నచ్చొ త్తింపఁగోరి కొంతభాగము చదివి విన్పించితిని. అప్పుడు వారా పాఁ తప్రతిని, క్రొత్తప్రతిని జూచి సంతసించి 'మీరింతశ్రమ యెట్లు పడితిరో' యనుచు, ఎండో 'మెంటు బోర్డువారికి సిఫార్సుచేసి కోటప్పకొండకు సంబంధించిన 'ఫండ్పు' నుండి మీకు వలసినంత ద్రవ్య మిప్పింతుమని వాగ్దానముచేసి నాదగ్గర నప్పుడప్పుడు 5, 6 అప్లికేషనులు తీసికొనిరి. కాని యెన్నాళ్ల కది యొక స్వరూపమునకు రాదయ్యెను. దాని కింకను మంచిరోజు రాలేదని తలంచితిని. పిమ్మట శిష్యుల నాశ్రయించినఁ గొదువయుండదను వెనుకటి మర్యాదతోఁ గొందఱి వెంటఁబడి మోసపడితిని. 'కాలాయ నమః' ఆనుకొంటిని. కొంతకాలము వితగ కడచిన కాలమునకు విలువగట్టి భగవంతునిపై భారముంచి యొకనాడు నరసరావుపేట మునిసిపల్ చైర్మన్ చిరంజీవి శ్రీ కొత్తూరి వెంకటేశ్వర్లను సమీపించి, పూర్వగాథ వివేదించి సాయము చేయఁగోరితిని, వెంటనే యాతఁడు__‘ వినయమతితో" "మన మిత్రులు పెక్కుమంది కలరు. మీ కోరిక తీర్తును. మీరు కించపడవల" దనెను. పూర్వకవుల గ్రంథములను పైకిఁ దెచ్చు నా యభిలాష యాతని సాదరవాక్యమున వర్ధిల్లి శ్రీ త్రికోటీశ్వరుని యను గ్రహము లోకమునకే కల్గినట్లు పొంగిపోయితిని. 'శుభమస్తు' అని వెడలితివి. ఆతఁడే ఒక నాఁడు నన్ను బిలిపించి నాకుఁ దెలియకుండఁగ నాతఁడు వేయించిన చందాదారుల పట్టిక నిచ్చి 'ఇంతవఱకయినది. మిగిలినది నాలుగైదు రోజులు తిరిగి పూర్తిచేయుదము' ఆనెను. నేనప్పు దాతని యుత్సాహమునకును, కార్యదీక్షకును, పరోపకారపరాయణత్వమునకును, గుండె దిటవునకును, గురుభక్తికిని, వృద్ధోప సేవకు నబ్బురపడి, నా మిత్రులతో నతని గుణములను గొండాడితిని. చిన్నతనము లోనే వానిని పురపాలక సంఘాధ్యక్ష పదవి వలచి వలపించినదమటలో నాతని లోని సుగుణములే నిదానమవి యా నాఁడు తలంచితిని. ప్రజలు- అందును శత్రువులై నవారు గూడ నాతని పరిపాలనా విధానములో వ్రేలుపెట్టి లోపమును చూపించినవారు లేకుండునట్లు పాలనకుఁగడంగి యచిరకాలముననే యాతఁడు పేరు గడచెను.