పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

ప్రతిష్ఠలు గడించుట యెంతయుఁ బ్రశంసనీయము. నేనాతని శిష్యత్వము నేనాఁడో మఱచితివి. కాని గురుత్వముమాత్ర మాతఁడు విస్మరించినవాఁడు కాఁడు. ఇంతకుఁ బరమేశ్వరుని యనుగ్రహ మీ విధమునఁ దోడయినది. నాలుగైదు నాళ్లలో వలసిన ధనము ప్రోగయినది. దాతలు గూడ ప్రయత్నమునకుఁ దగినటు లడుగుటతో నే ‘లేదు.కాదు' అనకుండ నిచ్చిరి. ఈ గడ్డు రోజులలో నిది యొక విశేషము. ఈ " కార్యక్రమములో నాకు శిష్యతుల్యులును పరమాప్తులునైన శ్రీ మారేపల్లి శ్రీరామ మూర్తి గారు మాకు విక్కార్యమున చేదోడు వాదోడుగాఁ దోడ్పడి గ్రంథము సమగ్ర రూపము దాల్చువఱకు దీక్షతో నిల్చిరి. ఇది శివానుగ్రహమని తలంతును. కార్యానుకూల్యమున కన్నియుఁ గలిసివచ్చునను పెద్దలమాట యనుభవైకవేద్యము ఈ గ్రంథమునఁ బ్రచురించిన బొమ్మలు నాకుఁ బరమ మిత్రులును, నర్సరావు పేటఛాయాచిత్రశాలాధిపతులునగు బ్రో. వే. వళ్లె బిందుమాధవాచార్యులు గారు స్వయముగా కొండ దగ్గఱకు వెళ్లి ఫోటోలు తీసికొనివచ్చి సమయమున కుచితముగా నందించిరి. ఇది తలవనితలంపుగా జరిగిన విషయము. వీరెల్లరి యాశయముల కెల్లప్పుడును పరమేశ్వరుఁడు శ్రీరామ రక్ష' యై శాశ్వతాయురారో గ్యైశ్వర్యముల నిచ్చి సర్వదా వీరిని, వీరి కుటుంబములను కాపాడుఁగాత మవి ప్రార్థించుచున్నాను.


తమ ప్రపితామహులు రచించిన ఈ గ్రంథమును బ్రకటించుటకు సర్వాధికార ములు నా కొసంగిన శ్రీ కొప్పరాజు వీరభద్రరావుగారి మహొదార్యభరిత సారస్వ తాభినివేశమునకు నా నమోవాకములు. పరమేశ్వరుఁడు వారికి చిరాయురైశ్వర్యము లొసఁగి రక్షించుఁ గాక


ఈ గ్రంథమును ముద్దులు మూటగట్టునట్లు ముద్రించి యిచ్చిన మదీయ సోదరులు, అజంతా ముద్రణాలయాధిపతులు, శతావధానులు, శ్రీ శ్రీనివాససోదరు లకు మిక్కిలి కృతజ్ఞుఁడను.

సంపాదకుఁడు