పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

ఆనందవల్లి (గొల్లభామ) కథ :


ఇట్లుండ నీ కొండకు దక్షిణమున ‘కొండకాపూ'రను గ్రామమున ‘సునందుఁ‘డను యాదవుఁడొకఁడుండెను. అతనిభార్య 'కుందరి', ఆమె ఆనందవల్లి' యను పుత్తికంబడపి యఖిల భోగభాగ్యములఁ దులఁడుఁగుచుండెను. ఆ బాలిక దినదిన ప్రవర్ధమాన యగుచు సర్వకాల సర్వావస్థలయందును 'శివార్పణబుద్ధితో సమస్త వ్రతదానము లొనర్చుచు విభూతి రుద్రాక్షలు దాల్చి చెలులతోఁ గొండనెక్కి శ్రీ కోటీశు నర్చించి వచ్చుచుండెను. తల్లిదండ్రు లా బాలిక నట్లుండవలదని వారించిరి. ఎంత చెప్పిన నామె వినక వారికిఁ దగు వైరాగ్యబోధలొనర్చి తల్లి దండ్రులఁ గూడ శివభక్తులుగ మార్చివైచేను. ఒక్కనాఁ డా బాలిక శివరాత్య్రుత్స వమున కేఁగి ఓంకారనదిని స్నానమాడి రుద్రశిఖరమున బిల్వవనాంతరమున దక్షిణామూర్తి స్వరూపముననున్న శ్రీ (పాత) కోటీశ్వరుని బూజించి, యించు కంత సేపు నిమీలిత నేత్రయై తిరిగి కన్నులు విచ్చినంతనే వెనుక సాలంకయ్యకు గన్పట్టి విందారగించిన జంగమయ్యరూపున నొక దివ్యపురుషుఁడు సాక్షాత్క రించేను. ఆనందవల్లి నిత్య మాతని కా పాపవినాశన ద్రోణీకనుండి తీర్థము రుద్ర శిఖరమునకుఁ దెచ్చి యభిషేకించి క్షీరములొసంగి, తద్భుక్తశేషమును దాను భుజించుచు కాలముఁ గడపుచుండెను.


సాలంకయ్య కీ వృత్తాంతము తెలిసి వచ్చి యామెకుఁ గన్పట్టి పూజగొను జంగమయ్యకుఁ దన్నెఱింగింపఁ బ్రార్థించి నిత్య మామెకడకు వచ్చుచుఁ బోవు చుండెను. జంగమమూర్తి మౌనముద్ర దాల్చియుండుటవలనఁ గాఁబోలు నామేకు సమయము పొనుపడదయ్యెను. అంతలో గ్రీష్మర్తువు వచ్చెను. అప్పటికి నామె నిత్యనై మి త్తికాదిక్రియలలో లోప మేమాత్రము రానీక యాతని నర్చించుచుండెను. ఒక్కనాఁ డామె తీర్థఘటమును దెచ్చి వానికి సమీపమున డించి, మఱచివచ్చిన బిల్వదళములకై పోఁవ నొకకాకి యాఘటముపై వ్రాలెను. కుండ బోర్లబడి నీరము నేలపాలయ్యెను. దాని కా ముగుద చింతిల్లి నేఁడు మొదలు వాయసములిటకు రాకుండుఁగాక' యని శపించెను. ఇయ్యది నేఁటికిని నిదర్శనమని యందురు. దీనినెల్లఁ జూచుచున్న జంగమయ్య 'ఆనందపల్లీ: బాలికవు. ఇంటనుండక నీవిట్లు శ్రమపడిన మావల్ల నీకు రాఁదగు సుఖము లేమి? నిష్ప్రయోజనము, ఇంటికేగుము' అనియెను. ఆమెయు దానికొల్లక యెప్పటియట్ల సేవింపుచుండెను. అంత నా దివ్యపురుషుఁడు జ్ఞానోపదేశమున నామె తన పూజ మానునవి యెంచి యట్లోనర్ప , నా బాల మిగుల భక్తి కలిగి వర్తింపుచుండెను. మఱియు