పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12


నామె 'స్వామీ! మీరు దైవస్వరూపులు. అందుపై గురువులరు. వీడిన గురు ద్రోహ మగు' నని చెప్పుచు నిత్యార్చన మానకుండెను. అందుల కా సిద్ధపురుషుఁ డామె పడు శ్రమలనుండి తప్పింపఁ దలఁచి, ఒకనాఁడు తన యోగమాయచే నస్థలిత బ్రహ్మచారిణి యగు నామెకు మాయా గర్భమును గల్పించేను. నవమాస మలు వచ్చి గర్భభరాలస యయ్యెము. అష్టకష్టముల కోర్చి యామె నిత్యవ్రత ముఘు మానకుండెను, దాని కా యోగపురుషుఁడు సంభ్రమాశ్చర్యములంది, 'తల్లీ : నీవింత శ్రమపడి యిచ్చటికి రానేల? నేనే నీ యింటికి వచ్చెదను. నీ వ్రత మచ్చటనే నెఱవేర్చుకొమము. కాని నీవు వెనుదిరిగి చూడకుండఁ బొమ్ము. చూచి తివో నే నందే నిలచెదను' అని చెప్పి యొప్పించి ముందు గొల్లభామయు వెనుక ప్రళయధ్వనులు మ్రోఁగుచుండఁ దానును రుద్రశిఖరమునుండి బ్రహ్మ శిఖరముదాఁక రాగా, నామె యా ఘోరధ్వనుల కోర్వలేక వెనుదిరిగి చూడఁగా నాతఁ డందేయుండి 'అబలా ఇంక నేనిందే సమాధినిష్ఠఁ జెందెదను. వ్రత భంగమైనది' అని యా శిఖరమునఁ గల బిలముఁ జొచ్చెను అదియే నేటి నూత్న కోటీశ్వరాలయ స్థలము, గొల్లభామయు నందేయుండి యచటఁ బ్రసవించి కుమా రుని గవి, వ్రతభంగమునకుఁ గుమిలి యందే ప్రాయోపవేశ మొనర్ప నెంచి మౌనముద్రం దాల్చి, యోగమూని కనులు దెఱచునంతలో ప్రక్కనున్న కుమారుఁ డదృశ్యుఁ డయ్యెను. వెంటనే యామె యదియంతయు దివ్యపురుషుని మహిమగాఁ దలంచి జన్మము ధవ్యమయ్యెనవి యెంచి యచ్చటనే సమాధిఁ బూని శివైక్యముం జెందెను.


సాలంకయ్య చివరి కథ :

ఇచ్చట సాలంకయ్యయు విత్యము గొల్లభామ యోగికితన చరిత్రము విన్పిం చుట కవకాశము కలుగలేదని చెప్పుచు నుండియుండి నేఁడు గొల్లభామ కూడ కన్పింపమికి వేచివేచి వెదకుచు బ్రహ్మశిఖరమున నున్న గుహకడకు రాఁగా నందున్న దివ్యపురుషుఁడు 'నేను నీ యింట విందారగించినవాఁడను, శివుఁడను, గొల్లభామకువ్రత సమాప్తి జేసితిని. ఆమె శివైక్యానుసంధానముఁ జెందెను. నేనిందే యుందును. దీనిపై దేవళ మొండు గట్టించి త్రికోటీశ్వర లింగమును బ్రతిష్ఠించి పూజింపుము. ఉత్సవ దినమున ఓంకార నదీస్నానము జేవి, నన్నభిషేకించి, ఉపవాస జాగరణాదు లొనర్చి, ప్రభలు గట్టించి, వీరాంగాది వాద్యముల న న్నల రించి మఱునాఁ డన్నదాన మొనర్పుము. గొల్లభామ నా భక్తురాలు, త్రోవలో