పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10


వేఁడెను. కిరాతుఁడు పక్షి నిమ్మనెను. శిబి "నా శరీరము నుండి దాని యెత్తు మాంసమైన విత్తుఁగాని పక్షి నీయననెను. ఎట్టకేలకు కిరాతు డందుల కొప్పుకొనఁగా రాజు పక్షిని త్రాసున నుంచి దానియెత్తు మాంసము తన దేహమునుండి తఱిగి రెండవ వైపునఁ బెట్టసాగెను. ఎంతకును లాభములేక తలయందలి మెదడు నౌక వైపు గోసిపెట్టిన నదియు నిష్ఫలమయ్యెను, రెండవ వైపునఁ గోయఁబోవ శివుఁడు మెచ్చి ప్రత్యక్షమై రాజు నతని కోరికపై తనయం దై క్యముగావించుకొనెను. అంత శిబిచక్రవర్తి లింగరూపమై కపోతేశ్వరుఁడను పేర వెలసెను. ఇది గుంటూరు జిల్లా - నర్సరావుపేట తాలూకాలోని చేజర్ల గ్రామమునఁ గలదు. దీవినే దక్షిణకాశీ యందురు. దేవాదులెల్ల నా లింగము నోంకారశబ్దమున నభిషేకించిన జలము భూగతమై లింగము క్రిందుగ వెల్వడి ఓంకార నది యన నొప్పేను.

సాలంకయ్య :


ఈ సాలంకయ్య కాలము తెలియదు. ఈతఁడు త్రికూటాద్రికి నుత్తరమునఁ గల ఎల్లమంద గ్రామమున లింగబలిజ కులమున నుద్భవించేను. ఈతఁడు గొప్ప శివభక్తుఁడు. ఇతనికి నల్గురు తమ్ములుండిరి. వారితో నీతఁ డదవికేఁగి కట్టెలే యమ్ముకొని జీవించుచు, జంగమార్చన సేయుచుండెను. ఆతఁడు రుద్రశిఖరమునఁ గల లింగము నర్చించి, యమిత ధనము నార్జిం చుచు, నిత్యము దాని నేమరక మెలఁగుచుండెను. తమ్ములతో నొకనాఁ డతఁడు పూలు తేర విష్ణుశిఖరమున కేఁగెను. అపుడు విపరీతమగు వర్షము గురిసెను. ఆ ధాటికి వారొక గుహఁ జేరియును ప్రాణములు నిలుపుకొనఁజాలక కోటీశ్వరుని శరణుజొచ్చిరి. కొంతవడికి వాన వెలిపెను. వారు శివుని దలంచుచు త్రోవఁబట్టి నడువ సెలయేటిచే భిన్నమైన యొక తిన్నెయందు ధనపుబిందె అభించెను. పాలంకయ్య దానివి శివప్రసాదమని గ్రహించి, స్వామి నారాధించి యింటికిఁ జని. సమస్త వైభవో పేతుఁడై జంగమారాధన వీడక కాలముఁ బుచ్చుచుండెను.


సాలంకయ్య యొక్కతఱి రుద్రశిఖరమునఁ బూజ గావింపుచుండ నక్కడ నొక జంగమయ్య ప్రత్యక్షమయ్యెను. అతఁడు వానివి పరశివునిగా మనోవాక్కాయ కర్మములఁ బూజించి తనయింటికి వచ్చి ధన్యుఁ జేయఁగోరెను. అతడు వల్లెయని యింటికివచ్చి భక్తుఁడిచ్చు వేఱుపదార్థము లొల్లక క్షీరమాత్రాహారుఁడై కొన్నాళ్ళుండి యుండి యొక్క నాడు మాయమయ్యెను. సాలంకుఁడాతని నిందునందు వెదకి ‘వేసారి విరాహారుఁడై యుండెను.