Jump to content

పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


ఇట్లు నిల్చిన నయ్యింతియుఁ బ్రతిదినంబును విష్ణుశిఖర ప్రాంత కాంత బిల్వకాంతారాంతరస్థిత పాపవినాశన లింగాగార ప్రాగ్భాగస్థ ద్రోణికాంత ర్జలంబులందోఁగి తదంబుపూర పూరిత పూర్ణకలశంబు శిరోభాగంబున ధరియించి రుద్రశృంగసంగత ప్రాచీన కోటీశ్వరలింగాలయ సమీప బిల్వ భూజాతస్థితుండగు నమ్మహాపురుషమూర్తికి ఉదత్కలశోదకంబుల నభి షేకంబుఁజేసి తత్రస్థ బిల్వ వనదళంబులం బూజించి, ధూపదీపంబులిచ్చి, క్షీరోపహారంబొసగి, తచ్చేషంబు తాను బానంబొనర్చుచు, నిరశనవ్రతంబుఁ బూని, కొంతకాలంబిట్లు గడుప, సాలంకాభిఖ్య భక్తవరుం డది విని యమ్మహాత్ముండు తనకు దర్శన మిచ్చిన జంగమమూర్తి యగునని భావించి,యగ్గిరి కరిగి, యచట న న్నగారోహణంబు జేయఁబూను నవ్వల్లవీ పల్లవాధరంగని, నిజోదంతంబెఱింగించి, యీ పర్వతాగ్రంబున నీచేతఁ బూజఁబడయుచుండు నమ్మహాత్మునకు సమయంబెఱింగి, నన్నెఱిం గింపు మంతఁదాక నిచటికి వచ్చుచుఁ బోవుచుండెద ననిన నయ్యింతియు నట్ల చేసెదననీ యమ్మౌనియు మౌనముద్రాధరుండగుట సమయంబుగామి నెఱింగింపదయ్యె, నంతఁ గొంతకాలంబరిగిన గ్రీష్మసమయంబున నయ్యు విద విష్ణుశిఖరప్రాంతస్థ ద్రోణికాజంపూరిత కలశంబు శిరంబున నిడికొని, యమ్ముని సమీపంబువ కరుగునెడ నుష్టభాను రాను తప్తగాత్రయై యలసి, యెట్టకేల కచ్చటి కరిగి యక్కలశం బచ్చోట నిలిపి బిల్వ పత్రార్థం బరుగునంత నొక్క వాయనం జరుదెంచి యక్కలశంబు దోని కినం గినిసి నేఁడాది ని న్న గేంద్రంబునకు వాయసంబు రాకుండెడు మని శపించి బహు శ్రమాకలితయై యున్న యన్నాతికి దయాక్రాంతస్వాంతుండై. యతం డిట్లనియె.123

బాల నిజగృహంబున సుఖోపాయముగను
నిలిచి విషయాభిలాషమై నిఖిల సుఖము
లనుభవించెడి నిండు యౌవనమునందు
వవమునందున నాయాపపడగనేల ?124