పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

113

అన విని జవ్వని యమ్ముని
గనుఁగొని తా నిట్టు లనియెఁ గాయము ప్రాయం
బను విషయములును, గాలం
బును సత్యంబగునె వట్టి మోహము లేలా ?126

వయసు వేళల ననశన వ్రత తపోగ్ర
వన నివాసాది కృత్యము ల్వదలి కామ్య
సుఖములే కోరి, భోగింపఁ జూచెనేని
ముదిమి వచ్చిన నింతైనఁ గదల వశమె ?127

కామ మెక్కువౌను, కడియు నోటికి బోదు
ధనమునందుఁ బ్రేమ దగులు మిగుల
చిక్కువడుచు నుండు జింతల వంతల
ముదిమి మోక్ష సౌఖ్యమునకు తెరవె ?128

అనిన వీని యయ్యింతికి వైరాగ్యంబు గలుగుట నమ్మునీంద్రుండు దెలిసి,
జ్ఞానోపదేశంబు జేసియైన నీ వ్రతాయాసంబు మాన్పెదగాక యని తలంచి
యిట్లనియె 129


నీకు వైరాగ్య ముండుట నీలవేణి
జ్ఞాన ముపదేశ మొనరింపఁ బూనినాఁడ
భూరి పై రాగ్యమే జ్ఞాన కారణంబు
జ్ఞాన మెక్కడ వైరాగ్య హీనునకును?130

ముఱియు బాహాభ్యంతరమ్ముల దశదిశావకాశంబుల సంకట పరిపూర్ణంబై చిదాకాశంబగు బ్రహ్మం బొక్కటియె విరాజిల్లు, నందుఁ ద్రిగుణాత్మకమైన మాయాశక్తి తదభిన్నమై జనించిన నది యుపాధిగాగల చైతన్యం బీశ్వ రుండై బ్రహ్మవిష్ణు రుద్రరూపంబుల జగత్సర్గస్థితిలయంబు లొనర్చుచుండు, నమ్మాయాశక్తి యవ్యక్త మహదహంకార పంచమహాభూతంబులయ్యె,