పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/143

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


ఇట్లు నిరంతరం బబ్బాల బాలేందు మకుటు నారాధింపుచుండి యంత నొక్క నాఁడు మహాశివరాత్రియం దోంకార నదీజలంబుల స్నానంబుజేసి, సితభసితో ద్ధూళన త్రిపుండ్ర రుద్రాక్షమాలికాలంకృతదేహయై శివనామామృతాంచిత రసనయై శివధ్యానలీనచిత్తయగుచు, నొక్కతియ య క్కు ధరేంద్రంబెక్కి యక్కడ రుద్ర శిఖరాగ్రస్థ కోటీశ్వర మహాలింగంబు షోడశోపచార పూజా విధానంబుచే నారాధనంబుజేసి, తత్య్రాంతకాంతబిల్వవనాంతర మధ్యంబు నం దొక్క శ్రీతరుమూలంబున పద్మాసనాసీనయై, జితేంద్రియ మరున్మనో వికారియై, కోటీశ్వరలింగంబు హృదయరంగంబున నిల్పి యంత మానస పూజావిధానం బధిష్ఠించి మఱియు—114

వటమూలరత్న విస్ఫుట వేదికామధ్య
         హాటకోల్లసిత సింహాసనమున
శతకోటి కందర్ప సౌందర్యమహిమతో,
         కలితశరన్మేఘ కాంతితోడ
సితభాను భానుళుచినయనములతోడ
       దరహాసశోభి వక్త్రంబుతోడ
వరదాభయ మృగాగ్నికర చతుష్కంబుతో
       మౌనముద్రాచ్ఛన్న మహిమతోడ
దనరి భక్తార్తి హారియౌ మునిశరణ్యు
మదనహరు నీలకంఠు నుమాసహాయు
హృదయగతుఁజేసి, తన్మూర్తిఁ జెదరకుండ
నిలిపి పూజించె నాభీర లలన భక్తి.115

జలజలోచన రాజోపచారములను
పూజఁ గావించి తల్లీన బుద్ధియగుచు
తన్ను జగములు మఱచి నేత్రములు మూసి
చొక్కి యంతట కనువిచ్చి చూచునపుడు.116