పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

కొండ పైని స్వామివారి సన్నిధి నర్చకులతోఁబాటు భక్తులుకూడ ప్రదక్షిణాది పేఐలొనర్చి కృతార్థులగుచున్నారు. ఇప్పటికి నఖండ దీపారాధన పూజాదికములు జరుగుచున్నవి. ప్రతి మాఘ శు।।1 నుండి మాసాంతముదాఁక ప్రజలు పశువులతో గిరిప్రదక్షిణము చేసి స్వామిని సేవించి, పలు విధములయిన మ్రొక్కుబడులు తీర్చుకొందురు. దేశ దేశములనుండి సుమారు రెండులక్షల ప్రజలీ యొక్క నాఁటి యుత్సవమునఁ బాల్గొందురు. సంకల్పము లేనివారికిని శివరాత్య్రు యుత్సవ సమయ మునకు నిర్నిమిత్తముఁగ భక్త్యుద్రేకము గలిగి తక్షణము బయలుదేఱి వెళ్లుట యిందలి ప్రత్యేకమహిమ యమటలో నతిశయోక్తి రవంతయులేదు. శివరాత్రినాఁటి యుత్సవమును, రకరకముల ప్రభలను, వాద్యములను, జనబాహుళ్యమును జూడని వాని జన్మము వ్యర్థమనియే చెప్పవచ్చును.

స్థలపురాణరచనలు :


ఈ స్థలమునకు యుగాంతరములనుండి మహిమ యున్నట్లు చెప్పుదురు. దీని మాహాత్మ్యమును దెలిసికొనుటకు (i) కీ. శే. బ్ర॥ కొప్పరాజు నరసింహకవి గారు వ్రాసిన ‘శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్య' మను మూడాశ్వాసముల పద్య కావ్యము (ప్రకృత గ్రంథము) ముఖ్యాధారము.

(ii) మఱియు క్రీ శ. 1905 లో రూపెనగుంట సీతారామయ్యగారు గుమ్మెట కథ (రగడ) నుత్సవాదులు వర్ణించుచు వ్రాసిరి.

(iii) డెబ్బదియేండ్ల క్రిందట బ్ర॥ తుళ్ళూరి మాధవరాయఁడుగా రీ కథను కుంచించి “మనఃకాంతాము క్తికాంతాసంవాద' మని 12 చరణముల కీర్తన వ్రాసిరి.

(iv) 1922 లో కీ. శే. బ్ర॥ తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రిచే రచింపబడిన 'శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్మ్యము"లో సుమారు 11 పేజీల కథను శ్రీ కోటీశ్వర మాహాత్మ్యమని వ్రాసిరి. అది దేవినిబట్టి వ్రాసిరో తెలియదు. కథాభాగము వేఱు.

ప్రకృత గ్రంథకర్త :

ఈ గ్రంథకర్త వివాసస్థలము సత్తెనపల్లి తాలూకా కోసూరు. గ్రంథమునం దీయబడిప వంశావళినిబట్టి యీ కవీంద్రుని వంశవృక్ష మీ ప్రక్కపుటలో నొసంగఁ బడినది. ఆదిపురుషుడైన కొప్పరాజువామమే వీరి గృహనామముగ నేర్పడుట. పలవు నాయన ప్రసిద్ధపురుషుఁడై యుండనోపు.