పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5

3. భ్రామరీస్తవము, భృంగరాజస్తవము యీ గ్రంథాది యందున్నవి వానిని చదువనిది మందు నూరరాదు.

4. రోగికి రోగనివృత్తియై సంతోషముచే నేదైన నీవచ్చిన యెడల యింత స్వల్పము తెచ్చితివేమని యనరాదు. ఇచ్చిన ఎంతైనను సరే. అది గాని ఒకవేళ ఔషధ ద్రవ్యములకై షుమారుగా నిచ్చిన దానిలో నెప్పుడయినా స్వల్పముగా మిగిలియున్న యెడల నదిగాని చక్కగా జ్ఞాపకముంచుకొని లేక వ్రాసిపెట్టి ధర్మకార్యమున కుపయోగించవలసినదిగాని వైద్యుడు స్వోప యోగము చేసికొనరాదు.

5. ధనమార్జించు నిమిత్తము వైద్యము సేయు వైద్యు లతో వైద్య విషయమై యేమియు మాటలాడరాదు.

6. భృంగరాజౌషధములచేతనిమ్మళించని దేహరోగములు అరుదుగా నుండుననియు, అవి యధార్థముచేత రోగములే కావ నియు, బరమేశ్వరునిచే బంపబడిన సాక్షాస్మృత్యు దేవతలనియు గట్టి నమ్మకముతో నుండవలయును.

7. వైద్యుడు పరిశుద్దదేహుడు, ఆస్తికుడు, మాంసాద్యా హార వర్జితుడు సత్కర్మ సహితుడుగా నుండవలయును.

8. వైద్యుడు సంగరహితుడుగా నుండుట మొదటి పక్షము. దురాశారహితుడుగా నుండుట రెండవపక్షము. ఆశాపిశాచగ్రస్తుడు అధముడు.