పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

ర్తించినవి. కాని అయనగారు యింకను నాకు అన్నియు తినుటకు ఆజ్ఞ యివ్వలేదు.

ఇంతట నేను చేసిన గ్రంధ "భృంగరాజమహిమము" జ్ఞాప కమువచ్చి గుడివాడకు జాబు వ్రాసి తెప్పించి తేట తెల్లముగా టీక వ్రాసి యచ్చు వేయించెదమని బుద్ధి పుట్టింది. యదార్థమునకు గుంటగలగరాకు సిద్ధౌషధము. అమృతతుల్యము. ఇప్పుడు పత్రిక లలో ఆర్థాశచే ప్రకటించు మందులు నేను చూచినట్లు నిష్ఫల ములు. గుంటగలగరాకు వైద్యము మాత్రము డబ్బడిగి వైద్యము చేయరాదని సిద్ధుడు చెప్పినాడు.

శ్రీ కామరాజుగడ్డ రామయ్య పంతులుగారి యాజ్ఞ పుచ్చు కొని ఇదివరలో నేను రచియించియున్న భృంగరాజ మహిమమును గ్రంధమును మంచి తేటతెల్లమైన టీకతో వేరుగ వ్రాయ బూనితిని.

వైద్యము చేయువాని విధులు

1. రోగి యీ వైద్యమును కోరగానే దాని వస్తు సామ గ్రిని వాడు తెచ్చుకొనుటతప్ప తననిమిత్తము యేదైనా నివ్వ వలసినదని యడుగరాదు.

2. రోగి ఔషధసామగ్రిని తెచ్చుకొనలేక వైద్యునిం గోరి నప్పుడు ఆ సామగ్రికి యదార్థముగా నెంత వెచ్చపడునో అం తియే పుచ్చుకొనవలయును.