పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

ముందు నిరాశ, ఒకప్పుడు దుఃఖము. బహీిర్దేశమునకు బోయెడి ముందు, వెళ్ళివచ్చిన తరువాత కొంతసేపు చెప్పలేనంత ఆయా సము, విసుగు, మొగము తెల్లబడుట, అంతట యెట్లాయెనేమి ఏ ఔషథములు పుచ్చుకొన్నను వినియోగములేదని యెంచుకొనియు పనియుండియు నా కొమరులు కొందరు నివసించియున్న బెజ వాడకు 7–11–1908 తారీఖున ప్రవేశించి యున్నాను. నా కొమ రులయొక్క ప్రోద్బలము చేతను, నాకు బుట్టిన కొన్ని యూహల చేతను నానావిధ వైద్యములు జరిగినవి కాని యెంతమాత్రము నిమ్మళింపకపోగా ఇకను దేహము నీరుపట్టెడి చిహ్నములు కూడ గాన్పించినవి. నేను వైద్యసేవ చేయువాడను కాను గాన నా స్వకీయ వైద్యమునకు దేనికి ప్రయత్నించనేలేదు. ఇట్లుండగా నెవ్వరో యిద్దరు ముగ్గురు కామరాజుగడ్డ రామయ్యవంతులుగారిని చూచినారాయాని యడిగిరి. వారికి వైద్యము తెలియునాయని నేను అడుగగా తెలియునని చెప్పిరి. ఆ మరునాటి యుదయమున వారియింటికి నేను వెళ్ళి నాకు ఆయనగారు తండ్రిగారి కాలము నుండియు పరిచితులేగనుక నా దేహస్థితి చెప్పి చూచితిని అంతట వారు మందు యెల్లుండి నుండి యిచ్చెదమనియు రేపు మా యింటికి వచ్చెదమనియు చెప్పి వాగ్దాన ప్రకారము వచ్చి గుంట గలగరాకు తెప్పించి తమయింటికి పంపవలసినదని చెప్పిరి. ఇట్లు ఏడుదినములు 2 తులముల పసరులో తమరొక యౌషధముంచి ఇత్తుమనియు, గోధుమలుపొట్టుతో విసరిచేసిన అప్పడాలు నమలితిను టయు, కావలసినన్ని ఆవుపాలు త్రాగుటయు పధ్యమని చెప్పిరి. అనుదినము అదే విధముగా కావించుచున్నాను. నీరుపట్టు చిహ్నా లతో నాకు అదివరకున్న యన్ని బాధలును మొదటిదినముననే నివ