పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

ఇటీవల యనగా 1906 వ సంవత్సరం ఆగస్టు నెల 9,10 తారీఖులను నేను గుంటూరు వెళ్ళి మా వియ్యంకుడుగారి యింటి వద్ద నుండగా వైద్యశాస్త్ర సంబంధ ప్రసంగము వచ్చినప్పుడు వారి దగ్గరనున్న శ్లోకములు పద్యములు నాకు కనుపరుచుటలో యీ చిన్న పుస్తకమును గూడ చూపిరి. అంతట నేను పరమా నందభరితుడనయి తక్కిన వన్నియు నేననుదినము చూచు చున్నవేకాని, ఇది క్రొత్తదియం జెప్పి స్ఖాలిత్యములు లేకుండ జక్కగ వ్రాయవలయునని తలంచి 1906 ఆగష్టు 11వ తారీఖు ననే నా శక్తి కొలది పరిశుద్ధి గలుగ వ్రాసితిని. కాని దాని యుపయోగమును కనుంగొనుటకు నేను అప్పుడే అదివరకు వ్యాధిగ్రస్త శరీరుడనయియున్నను విశేషబాధ లేకుండుట వలన యీ పుస్తక మునకు ప్రతియొకటి వ్రాయవలసి యుండెను. కాని చిరంజీవు లగు నా మేనల్లుడు ఉప్పులూరి మల్లిఖార్జున రావు (గుడివాడలో ప్లీడరు) ఇతని తమ్ముడు నరసింహారావుల యొద్దనుంచి శాస్త్ర వాదములకై విశాఖపట్టణములవరకు బోవలసినట్లు తంతివార్తలు వచ్చియున్నందున నేను అట్లే వెళ్ళియుంటిని. తరువాత ఆ దేశములోనే నాకు దేహవ్యాధి ముదిరి నానావిధములగు దుగు౯ ణములు ప్రబలినందున 1906 అక్టోబరు 10వ తారీఖునకు ఏలూరు చేరినాను. వైద్యులు నానావిధములగు నౌషధసేవలు సేయించు చునే యున్నారు, ఆ నెల 23 వ తారీఖున హఠాత్తుగా జ్ఞాపక శక్తియు తగ్గినది. గ్రంథము చదువలేక పోతిని. నా వ్యాధి గుణ ములు ఏవి యనగా శ్వాస, దగ్గుఁ నీరసము, అన్నపుతిండి క్షీణిం చుట, విరేచనబంధము, గొంతువాసన, రొమ్ముమంట, మిక్కిలి బరువు, విశ్రాంతిలేకపోవుట, బ్రతుకనను నిశ్చయబుద్ధి. ప్రపంచ