పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భృంగరాజమహిమము

ఇవి ఆదినాధ సిద్ధునిచే నవనాధసిద్ధునకు ఉపదేశింపబడెను పండిత శ్రీ దాసు శ్రీరామమంత్రిగారిచే అనువదింపబడినది

భృంగరాజము అనగా గుంటగలగర చెట్టు. ఇది మానవుల రోగనివారణార్ధమై యాదికాలమున శ్రీమహాదేవి యవతారమైన భ్రామరీదేవివలన సృష్టింపబడినట్లును, సర్వరోగములను నివారింపజేయుశక్తి దీనియందున్నదనియు పూర్వకాలమున ఆది నాధుడను సిద్దుడు నవనాధుడను సిద్ధునితో జెప్ప కొంత గ్రంధము నుపదేశించినట్లు సంస్కృతములో నొక చిన్న పుస్తక ముండెను. ఆ గ్రంధము ఎట్లెట్లో సత్తెనపల్లి తాలూకాన సంచారవశముగా వచ్చిన గోసాయివలన నొక బ్రాహ్మణవృద్ధుడు గ్రహించెగాని అది వ్రాయుటలో గణములు మొదలగునవి మిక్కిలి తప్పులుగా నుండెను. కొన్ని చోటుల తెలుగున వ్రాయబడియుండెను. ఆ భాగమును గణ యతి ప్రాసాదులు మిక్కిలి తప్పులుగా నుండెను. కాని యందులోని యోషధులు వస్తువులు వీని పేళ్ళు మాత్రము తెలిసికొనదగియే యున్నవి. ఇట్లుండగా ఆ సత్తెనపల్లి తాలూకా ప్రాంతములలో రాజకీయ వ్యవహార మొకటి యవలంబించి యున్నప్పుడు నా నాల్గవకుమారుడు గోవిందరావు మామగారగు శ్రీ గోవిందరాజు భావనారాయణ వంతులుగారు ఆ పుస్తకమును తామొక ప్రతి వ్రాసుకుని తమ ప్రాతపెట్టెలో పడవైచియుంచిరి.