పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

9. వైద్యుడు 16 సంవత్సరములకు లోబడి యుండరాదు 75 సంవత్సరములకు పైవాడుగా నుండరాదు. వీరే వైద్యులు, తక్కినవారు కారని ఆదినాధ సిద్ధుని మతము.

రోగుల విధులు

1. భ్రామరీస్తవము, భృంగరాజస్తవము చేసియైనను వినియైనను ఔషధము పుచ్చుకొనవలయును.

2. ఈ భృంగరాజౌషధమందు భక్తియు నమ్మకము నుండ వలయును. లేనియెడల నీమందు పుచ్చుకొననే కూడదు.

3. ధనము పుచ్చుకొని మందివ్వని వైద్యులు మోస గాండ్రని గట్టిగా నమ్మక ముంచవలయును.

4. రోగము నివారణమయినప్పటికీ యీ భృంగరాజ వైద్యునకు విధిగా నేమయిన నివ్వవలయునని యనుకొనరాదు.

5. మందుకు అయ్యెడు స్వల్పముగు వ్యయము తప్ప నాకిక నేమియులేదను నిర్విచార మనస్సుతో నుండవలయును.

6. వైద్యునియందు భక్తియు నమ్మక మునుగలిగియున్న యెడల మాత్రమే యీ వైద్యమునకు పూనవలెను.

7. సంసారరహితుడు వైద్యుడయిన యెడల మిక్కిలి మంచిది. సంసారియైనను, సన్మార్గవర్తియు పరులను బాధిం చని వాడును సద్వంశము గలవాడును మాంసాహారవర్జితుడును నగునట్టి వైద్యునిం గోరుట సమపక్షము. తదితరులు యీ వైద్యమునకు సుతరాం పనికిరారు.