పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

8. వైద్యుడు చెప్పిన పథ్యము తప్పక చేయవలయును.

9. వస్తుసామగ్రి తనంతట తాను సంపాదించు కొని పుటములు వేసికొని మందు వేసుకొని అనుభవించ గల నేర్పరి యట్లు చేయవచ్చును.(ఇది కష్టము.) ఈ వైద్యమందు తాత్పర్యము గలవారు యీ చిన్న పుస్తకమును సంపాదించుకొని యింటిలో జాగ్రత్తగా నుంచుకొన వలయును. లేదా చదువు వచ్చిన వారి యొద్దనుంచుకొని వినుచుండ వలయును.

ఇట్లని యాదినాధ సిద్ధునిమతము.

బెజవాడ

10.3_1907

దాసు శ్రీరాములు

భృంగరాజ మహిమము

(గుంటకలగరచెట్టు మహిమ)

భ్రామరీదేవి స్తవము

శ్లో॥ ఆదిశక్తి స్వరూపాంచ | నిర్జరావనతత్పరామ్
ఆరోగ్యదాయినీంవందే | భామరీంలోకపోషణీమ్||

భృంగరాజ స్తవము


శ్లో॥ భ్రామరీపద సంభూతం గంగాతటనివాసినం
భృంగరాజం నమామ్యద్య | సర్వరోగనివారణం||

ఆదినాధస్తవము


శ్లో॥ ఆదినాధం మహాసిద్ధం | చంపకారణ్యవాసినం
లోకసంచారిణం సాధుం | మహావైద్యవిశారదం||