పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

నవనాధ స్తవము

శ్లో॥ భావయేనవనాధంచ నిత్యంవననివాసినం లోకోపకారిణం వందే | మమరోగాపను త్తయే

క. శ్రీకరముగ నవనాధుడు
ప్రాకటగతి చెప్పినట్టి పరవైద్యమునే
నేకతమున దెనిగింతును
మాకేవల భృంగరాజు మహిమము వేడ్కన్

శ్రీ మన్నవ నాధుండను మహా సిద్దుడు సంస్కృతమున జేసిన భృంగరాజ మహిమమను వైద్యగ్రంధమునకు నేను తెనుగు జేసి పద్యములలో వ్రాసేదను.

ఆదినాధ సిద్ధుడు నవనాధ సిద్ధునితో నిట్లని వచించె.

ఆ.వె. భృంగరాజ శక్తి సంగతియేమందు
సంగతాపముల భయంబులడచు
లింగమూర్తి తలను బొంగారుచున్నట్టి
గంగ యందపుట్టె గాదె తల్లి

గుంటగలగర చెట్టుయొక్క ప్రభావము నేనేమని చెప్పుదు ఈ మొక్క ప్రధమమందు గంగానదియొడ్డున వెలసినది. సర్వరోగ తాపములను బోగొట్టును.

ఆ.వె. చెలగి భృంగరాజ సేవనంబువ నెన్న
దరముగాని రోగ తతియడంగు
బురుషునకు దలంవ బూర్ణబలంబిచ్చు
ననుచు జెప్పె సిద్ధుడాదరమున.॥