పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

ఈ గుంటగలగర మొక్క యెంతటి కఠినమైన రోగముల నయినను మాన్పును, శరీరమునకు మంచి బలముపట్టును.

ఆ.వె.గుంటకల్గ రొడలి పుంటిని గింటిని
బంటుతనముగిల్లి బాగోనర్చు
ఒడలివ్యాధులెల్ల సడలి బలముకల్గు
నంటురోగనముదయంబు విడుచు ||

ఈ గుంటగలగర బలమునిచ్చును, మేహపుండ్లను, కురువు లను మాన్పును, నేత్రరోగములు కుదుర్బును. అంటు వ్యాధుల నివారించును.

గుంటగలగర మొలకల గుణములెన్న
వశముగాకుండు నెంతటివారికయిన
సంతతానంద మొనరించు సర్వగతుల
నలర సేవించు వారికే తెలియవలయు||

ఈ గుంటగలగర మొక్కల గుణము లిట్టివని చెప్పుట కెవ్వ రికిని సాధ్యముకాదు. ఎంతటి బాధలో నున్నవారయినను ఆనం దముకలిగి జీవింతురు. ఆ వైద్య మనుభవించిన వారికే దాని గుణము తెలియగలదు.

సీ॥ భృంగరాజముదెచ్చి పెలుచన నెండించి
చూర్ణంబుచేసి విశుద్ధిమీర
వస్త్ర ఖాళనమును వరుసనే కావించి
యైదుభాగములుగా నమరబెట్టి