పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

మిరియాలచూర్ణంబు మిళితంబుగా మూడు
భాగంబులందులో బరగనునిచి
సొంఠిపిప్పలిపొడుల్ సొంపారరెండేసి
పాళ్ళందులోన తప్పకయకల్పి
అక్కలకరపొడి యనువుగా రెండు పా
ళ్ళందులో నేర్పుతో బొందుపరచి

గీ॥ గాలిసౌరకుండ నొకబు ర్రగట్టిసేని
కర్షమాత్రంబు తేనెతో గల్పికొనుచు
ననవరతమును నరుడు జీవన ముజేయ
వ్యాధిరాదని సిద్ధుండు పలికే నిజము.

గుంటగలగరాకు బాగుగా నెండించి చూర్ణము చేసి వస్త్ర ఖాళికము చేసి దానిని అయిదు భాగములుగా బెట్టి మిరియాల పొడి కలిపిన మూడు భాగములను, శొంఠి, పిప్పిళ్ళు మిరియాలు కలిపిన రెండు భాగములను అక్కలకర్రపొడి రెండు భాగములను గలిపి యొక బుర్రలో (సీసాలో) బోసి గాలి తగలకుండగజేసి పరిశుద్ధ ప్రదేశమునందుంచి యనుదినము మూడువేళ్ళ చివరలకు వచ్చినంత తేనెతో గలిపి సేవించుచుండెనేని సాధారణముగా జన్మావధివరకు రోగము రాదని సిద్ధుడు చెప్పెను.

తే.గీ.వాతరోగంబులకు నిదివై రిసుమ్ము
ప్రాతబెల్లముతో గూర్చి పరగనూరి
రేగుపండ్లంత మాత్రలు రోగికిడిన
శూలలన్నియు గడియలో దూలిపోవు