పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

ప్రాతబెల్లము, గుంటగలగరాకు పసరులో భావనచేసి రేగు పండ్లంత మాత్రలు చేసి అనుదినము సేవించుచుండెనేని వాత శూలలు హరించును.

సీ|| చక్కగా భృంగరాజము సమూలముదెచ్చి
సూర్యాగ్ని నెండించి సొంపుమీర
యామద్వయము ఖల్వమందున మర్దించి
హితముగా వస్త్రఖాళితము జేసి
తొమ్మిదిభాగంబు లిమ్ముగాగావించి
చెలువుగా శొంఠి పిప్పలి మిరెముల
పొడి మూడుపాళ్ళును బొందించి కరకకా
యలపొప్పరలపొడి యదొకపాలు
నన్నింట గటకరోహిణి యొకపాలును
మిశ్రంబుగావించి మేల్మిదనర

తే.గీ.బుర్రలో మూసి చక్కగా బుచ్చుకొనెడి
తిరినినవమాషములయెత్తు స్ఫురణముగను
సురససింధూర చూర్ణంబు సాన్పితేనే
తోడగర్షంబు సేవింప తొలగు మూడు
దోషముల్ క్షయరోగముల్ ధూర్త కుష్ఠ
ములు నడంచును సిద్దుండు పలికె నిజము

గుంటగలగరాకు యెండను సమూలము నెండించి మెత్తగా రెండుజాములు పొడిచేసి వస్త్రఘాలితముజేసి ఆ పొడి తొమ్మిది