పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

పాళ్ళును శొంఠి పిప్పళ్ళు మిరియాల చూర్ణము మూడుపొళ్ళును, కరకకాయల బెరడు చూర్ణము 1 పాలును, కటుక రోహిణి పొడి యొకపాలును గలిపి సీసాలో గాలి తగులకుండా గట్టివేసి ఔషధ సేవ సేయునప్పుడు మూడువేళ్ళ చివరలకు వచ్చినంత తీసుకొని తొమ్మిది మినపగింజలయెత్తు రస సింథూరము పొడి కలిపి తేనెతో చక్కగా మాత్రలు చేసి పుచ్చుకొనెనేని వాతపిత్త శ్లేష్మముల వలన కలిగిన క్షయరోగములు, కుష్ఠురోగములు మానునని ఆదినాధ సిద్ధుడు చెప్పేను. అనిన విని సంతసించి నవనాధుడాదినాధుని కిట్లనియె.

తే.గీ.గుంటగలగర మొలకల బండుతనము
వింటి నీముఖమున నేడు వీనులలర
కొంటెలకు నెల్ల బుట్టెడు నంటు రుజలు
దీనితో మానువిధమును దెలుపు మనఘ.

నీవలన గుంటగలగరాకు మహిమ కొంత వింటిని దీనితో అండురోగములెట్లు మానునో తెలియజేయగోరుచున్నాను, అనిన విని యాదినాథుండు జెప్పెద వినుమని యిట్లనియె.

క.మిరియపు గింజలు తొమ్మది
వరుసం జూర్ణముచేసి వదలక యందు౯
వరభృంగదళ నవకము౯
బెరిమె మెదిపి తినిన జిలిపి వెతబడగించున్.

మిరియపు గింజలు తొమ్మిదింటిని చూర్ణముచేసి గుంటగల గరాకులు తొమ్మిది ఆ చూర్ణముతో గట్టిగా మెదపి తినుచుండెనేని సెగ మొదలగు అంటురోగములు మానును.