పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

క.పిప్పళ్ళును మిరియంబులు
నొప్పుగ శొంఠియును మోడి యొగివసకరకల్
తప్పక సమములు పొడిగా
గుప్పిగలగర రసమునను గొనుడి రుజలకుస్

పిప్పళ్లు మిరిముములు, శొంఠి, పిప్పలిమోడి, వస కరక కాయల పప్పర సమభాగములుగా నూరి గుంటగలగరాకు పస రుతో సేవించిన విషూచి, మొదలగు అంటురోగాలు మానును, అనిన విని నవనాథుండు సన్నిపాతంబులకును జ్వరంబులకును మార్గంబడిగిన నతండు పరమానందమున నిట్టని చెప్ప దొడంగె.

చ. గుటగుటవేళ్ళ చెక్క యును గోరిక మీరగిదెచ్చి పిమ్మటన్
చటుల తరంపు కల్గరసంబున మర్దనిజేసి మాత్రలన్
దటవిటలేకయొక్కోకటి నాలుగు గుంజలయెత్తు చొప్పునన్
తటుకున రోగికిచ్చినను తందర సన్ని హరించు వేగమే||

గుటగుటచెక్కయనగా కొందరుకాడమునగ చెక్కయనియు గొందరు తెల్లగలిజేరుపప్పరయనియు చెప్పుచున్నారు. యధా ర్ధమయిన యర్ధము ఇదియని తిన్నగా తెలియలేదు. గుటగుటవేళ్ళ చెక్కను గుంటగలగరాకు రసముతో మర్దనచేసి నాలుగేసిగుంజల యెత్తు మాత్రలు చేసి పుచ్చుకొనినయెడల సన్నిపాతములు మానును.