పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

తే.గీ.శొంఠి పిప్పలి మిరియాలు సొరిదిగటుక
రోహిణియు గంటుభారంగి రూఢి మునగ
చెక్కయును గరకపప్పరజేర్చి యుప్పి
చెక్క చూర్ణంతో బుజేర్చి చెంగి తముల
పాకురసమును గలగరయాకురసము
బోసి యామద్వయమ్ము సంపూర్ణముగను
మర్దనముజేసి బదరప్రమాణమాత్ర
లొనర గావించి రోగి తాదినినయేని
సన్నిపాతంబు లన్నియు సమసిపోవు.॥

శొంఠి పిప్పళ్ళు మిరియాలు కటుకరోహిణి గంటు బారంగి మునగచెక్క కరకకాయలపేళ్ళు, ఉప్పి చెక్క చూర్ణము సమ భాగములుగా జేసి ఒకజాము తములపాకుల రసమున, మరియొక జాము గుంటగలగరాకు రసమున మర్దనజేసి రేగుపండ్లంత మాత్రలు చేసి సేవించిన సన్నిపాతంబులన్నియు మానును.

సీ౹౹ భృంగరాజపు చెట్టు పొంగుచు గొనివచ్చి
యాకులు నీనలు నలరుకాడ
అన్ని యుగ్రమముగా నలరంగ గూర్పియు
ఛిద్రంబులేనట్టి చెలువమైన
కుండవాసేన మీద గోమరొప్పగానుంచి
వెలయఁగ శొంఠి పిప్పలి మిరెముల
పొడియందులోనుంచి మూతగట్టిగవై చి
యటిక క్రిందను మంటననువు పరచి
ఒకజామువండి బై లకుదీసి ఖల్వాన
నిడి భృంగరసమున నెనయనూరి