పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

తే.గీ.యందుసిందూరమును గల్పియంతసేపు
మర్దనముచేసి గుంజాప్రమాణమయిన
మాత్రలను దిన జ్వరములు మానువేగ
ననుచు సిద్ధుడు వచియించె అద్భుతముగ.

గుంటగలగరచెట్టు సమూలముదెచ్చి చిల్లులులేని కుండకు
వాసెనగట్టి దాని మీదనుంచి శొంతి పిప్పళ్ళు మిరియాలపొడి
బాగుగావై చి మూకుడుతో గట్టిగా మూసి మధ్యాగ్నిచే నొక
జామువండి బయటకుదీసి గుంటగలగరాకు రసముతో ఖల్వాన జాము
నూరి గురిగింజలంత మాత్రలు చేసి పుచ్చుకొనిన యెడల జ్వర
ములు మానును.

అంత నవనాధుండు భృంగరాజం జండళూలాదుల కుపయో
గించు విధంబుపదేశింపవే యని యడిగిన నతండు.

తే.గీ.కండచక్కెర మిరియాలు గలయనూరి
గుంటగల్గర పసరులో గూర్చి కల్పి
మూడుతులముల యెత్తును మొనసిత్రాగ
నండశూలలు మూనాళ్ళ కడగిపోవు

పంచదార మిరియాలు బాగా సూరి గుంటగలగరాకు పస
రులో కలిపి మూడేసి తులాల చొప్పున పుచ్చుకొనవలయును.
వృషణాది (అండవాతము) శూలలు మానును.

సీ. అండశూలలనెల్ల ఖండించు విధమును
తాల్మితో నుడివెద దనరవినుము