పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

భృంగరాజంబున బేర్మిరసము దీసి
కటుకరోహిణినందు గలయ నూరి
తేనెను దానిలో దెల్లంబుగా నుంచి
తర్వాత నార్ద్రవస్త్రమున రాచి
అండదేశము చుట్టి కొండొక సేవుంచి
పండునిప్పులమీద బరగ గాచి

తే.గీ.మూడుదినముల నీరితి మొనసిచేయ
వాపడంగును శమియించు వడిగ శూల
సుఖముగానుండు సండముల్ శుద్ధములగు
ననుచు సిద్ధుండు వచియించే నద్భుతముగ.

కటుకరోహిణి గుంటగలగరాకు రసముతో నూరి తేనెలో
రంగరించి తడిబట్టకు పూసి అండముల మీద వైచి పండునిప్పుల
మీద కొంత సేపు కాచుచుండవలెను. మూడు దినములీలాగున
జేయగా వాపుతీసి నొప్పి శమించును.

క.వెలిగారము పొంగించియు
కలిలోసన్ భృంగరసము కల్పియు వేగన్
తెలుపగు ఫేవముతోడన్
సలువుగ ద్రావింప శూల నటనలడంచున్

పొంగించిన వెలిగారము గుంటగలగరాకు పసరుతో చేర్చిన కడుగు బాగుగా గిల్కరించి నురుగువచ్చునట్లు జేసి తాగించిన యెడల శూలలు మానును.