ఈ పుట అచ్చుదిద్దబడ్డది
17
మేహవాయువుతో గూడిన శూలలకు
| తే.గీ. | ఆరతులము కట్కరోహిణి సరగసూరి | |
అరతులము కటుకరోహిణి అంతే మిరియాల చూర్ణముతో కలిపి నాల్గుతులముల గుంటగలగర పసరులో బాగుగా గలిపి పుచ్చుకొన్న యెడల శూలలు హరించును.
| తే.గీ. | భృంగరాజపు కొనలను సంగతముగ | |
గుంటగలగరాకులు ఏడుకొనలతోనున్నవి,మిరియాలు ఏడు కల్పి సేవించిన యెడల చురుకు సెగలు మానును.
| తే.గీ. | ఏడుదినములు సేవింపనెల్ల గతుల | |
పై పద్యములో చెప్పినమందును 7 రోజులు పుచ్చుకొనిన యెడల పొక్కు సవాయి, చచ్చు మొదలగు చెడు రోగములు మానును.