పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

అనిన నవనాథుండు నేత్రరోగంబుల కుపాయంబడిగిన నాది నాథుండు

ఆ.వె.భృంగరాజ రసము పొలుపొందగా దీసి
తుమ్మియాకు రసము తోడుజేసి
పిప్పలందు నూరి తెప్పన బెట్టిన
అక్షిమాంసదోష మణగిపోదె.

పిప్పళ్ళను తుమ్మియాకు రసముతోను గుంటగలగరాకు
రసముతోను చక్కగా కాటుకవలె జేసి కన్నులకు పెట్టిన దుర్మాంస
దోషములడగిపోవును.

ఆ.వె.కలగరాకు రసము గారవంబునతీసి
గారపండుజిగట గలయు నూరి
కన్నులందు బెట్ట కంపదోషమడంగు
నెలకు పూలుదొలగు నెమ్మి హెచ్చు.

గారపండు జిగట తెచ్చి గుంటగలగరాకురసముతో బాగుగా
నూరి కన్నులకు బెట్టిన యెడల కన్ను అదురుట మిటమిటలాడుట
మానును. ఒక నెలరోజులు బెట్టిన పూలు కూడా మానును.

సీ. భృంగరాజరసంబు సంగతం బొనరించి
మిరియపు గింజల మిళితపరచి
కటుకరోహిణితోడ ఖల్వంబులోనుంచి
యా మత్రయంబున నమరనూరి