పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

తలమాదలకు దీని దట్టంబుగ బూయ
     బరిశుద్ధముగ మాను వదిదినాల
మరియారసంబున మంచి తెల్లనిజిల్లె
     డాకురసమును గల్పి యతిరయమున

తే.గీ.శ్రవణరంధ్రబులను నొక్క జాము బిడిచి
చూడనెంతటి సర్పంబు గాడగరచి
బాధపడుచున్న దొలగు నిర్భయతబొసగు
వృశ్పికవిషంబు దొలగించు వేరిపసరు

మిరియాలు కటుకరోహిణి ఖల్వములో బాగుగా గుంటగల
గరాకు పసరుతోనూరి తలమాదలకు రాచినయెడల మానును, ఇది
మూడుజాములుమర్ధన పదిదినాలు రాయవలెను.

మరియు గుంటగలగరరసముతో తెల్లజిల్లేడాకు రసములో
జాము పిడిచిన పాముకాటు మానును. వేరిరసము తేలుకాటును
మాన్పును.

తే.గీ.ఆరువిధముల మాదలు నణగిపోవు
తేలుపడిచచ్చు పురుగులు తెరలిపోవు
రోమములు లేనిచోటను రోమచయము
దట్టముగబట్టు కలగరాకెట్టి దొక్కొ.

అనుపాన విశేషములు బాగుగా దెలిసి పరిశుద్ధాంతస్సుకల
వైద్యుడు పనిచేసేనేని అరు విధములగు మాదలును కుదురును.
తేలు చచ్చును. పురుగులు నశించును. రోమములూడిపోయిన
స్థలములలో రోమములు మొలచును.