పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

అంత నవనాధుండు విశేష విధులడిగిన నాదినాథుండిట్లని వచియించెను.

జ్వరాదులకు అమృతసంజీవనీ రసము

కం.రసవిష గంధకములతో
నుసమంబులు హింగుళంబు సౌన్పి క్రమముగా
వెసనుగటుక రోహిణితో
విసువక భృంగరసమర్ధ విధిజ్వరహరమౌ౹౹

రసము, నాభిగంధకము ఇంగిలీకము కటుకరోహిణి సమ
భాగములుగా పాళ్ళువేసి గుంటగలగరాకు రసముతో మర్దించి
సేవింపజేసిన సర్వజ్వరసులు మానును.

ఆ.వె.భృంగరాజ రసముపోసి యందును బ్రాత
యినుప చిట్టె మొక్కయింత గూర్చి
కరకతాడి యుసిరికల గూర్చియు సుగంధి
పాలవేళ్ళ రసము పరగబోసి
కల్పికాచి చక్కగలయంగబూసిన
వేగనెరుపుమాను వెంట్రుకలకు౹౹

గుంటగలగలర రసములో ప్రాతయినుప చిట్టెమును కరిక
తాడియుసిరికలును సుగంధిపాల వేళ్ళరసమును బోసి కల్పి
బాగుగా కాచి తలకు బాగా మర్దన చేసి వెంట్రుకలకు
యెడల అకాలపు నెరుపు తక్షణము మానును.