పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21

కం.కస్తురి గోరోజనమును
ముస్తలు త్రికటుకలు త్రిఫలములు భృంగరస
ప్రస్తుత మర్థిత మాత్రల
విస్తరమడగున్ బ్రసూతి విషరోగములుస్ ౹౹

కస్తూరి గోరోజనము తు౦గముస్తలు శొంఠి పిప్పళ్ళు మిరి
యాలు కరకతాడి ఉశిరికలు, బాగుగా మర్ధించి మాత్రలు చేసి
ప్రసూతి, విషరోగముల కిచ్చినయెడల, నవిమానును.

ఆ.వె.భృంగరాజరసమునిడి పొన్నగంటియు
పాలు నాముదంబు పరగనెయ్యి
నుసిరికల రసంబు నొగి కలబంచయు
నారికడపు పువ్వు మీరగల్పి
తిప్పతీగెరసము నొప్పగాచిన నూనె
తలకునంట నేత్రములకు చలువ

గుంటగలగరాకు రసము, పొన్నగంటిరసము పాలు ఆము
దము నెయ్యి ఉశిరికాయరసము, కలబందరసము, కొబ్బరి
పూవుకషాయము, తిప్పతీగెరసము, పోసి కాచి చమురుతీసి తలకు
మర్ధన చేసిన యెడల నేత్రములకు మంచిది. దీనినే భృంగామలక
తైలము అందురు.

తే.గీ.ముషిణివేళ్ళ పొట్టు ముగినల్ల యుప్పియు
కాన్గవేళ్ళ పొట్టు తలయనూరి
భృంగనింబరస సమేతంబులం జేయ
నల్లకుష్ఠువేగ నాశమందు

ముషిణివేళ్ళ పొట్టును, నల్ల యుప్పి పొట్టును, గానుగ
వేళ్ళ పొట్టును బాగా నూరి గుంటగలగరాకు రసములోను వేప
చెక్క రసముతోను కలిపి సేవించిన యెడల సల్లకుష్టు మానును.