పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

తే.గీ. నల్ల కుష్ఠు చూర్ణమెల్లవరా యెత్తు
పూట కొక్కమారు పుచ్చుకొనుచు
వచ్చ పెసలపప్పు నచ్చావు మజ్జిగ
పధ్యమని యెరింగి వాడవలయు

పైన చెప్పబడిన సల్లకుష్ఠు కేర్పడిన చూర్ణము పూటకొక్క
వరహాయెత్తు చొప్పున పుచ్చుకొనవలసినది. పచ్చ పెసలపప్పును
ఆపు మజ్జిగయును పధ్యములు. తక్కినవేమియు పనికిరావు.

తే.గీ.నల్ల కుష్టు మాన నరుడెంచినేనియు
వేపచెక్క గంధమేపు మీద
భృంగరాజ రసము సంగతంబుగజేసి
రాచుచుండవలయు రమ్యముగను

పైన చెప్పబడిన కష్టురోగమున కేర్పడిన చూర్ణమును
సేవించునప్పుడు వేపచెక్క గంధమును గుంటగలగర ఆకురసమును
కలిపి దేహమునకు రాయుచుండవలెను.

క.ఇలనల్ల కుష్ఠుపోవగ
దలచిన మూనాళ్ళకవల దలయంటుకొనన్
వలయును నామిదమున నీ
వల నెరుగవలయు జుండువారక మనుజుల్

పైన చెప్పిన చూర్ణము సేవించునప్పుడు ఆమిదము తో
మూడేసి దినముల కొకసారి తలయంటుకొనుచుండవలెను.

తే.గీ.భృంగరాజ రసము బేర్మి యంత్రంబున
వారుణీరసంబు వరలకేసి
నిలవయుంచి రేని యిలనెల్ల రుజలకు
వాడవచ్చు మిగుల వైద్యనిథులు

గుంటగలగరాకు రసమును బట్టిబెట్టి సారము దీసి నిలువ యుంచుకొనిన యెడల అన్ని రోగములకు వాడవచ్చును.