16
ఒకవేళ ఈ శ్లోకము పఠించినను బ్రాహ్మణకర్త బ్రాహ్మణ భోక్త ఏర్పడనప్పుడు విపతీర్ధమహిమను గొనియాడుకొనుట కుదాహరణముగా జెప్పుకౌసిన తప్పులేదు.
| 3. | "ఓషధయ:సంవదంతే సోమేనసహరాజ్ఞాయస్మై | |
ఈ మంత్రము ఆవాహనానంతరము అక్షతలు భోక్తలమీద జల్లునప్పుడు వచ్చును. ఇందులోని బ్రాహ్మణపదము కర్తకర్థము గాని భోక్తకు సంబంధించదు.
దీనియర్ధ మేమనగా
సోముడనేరాజుతో ఓషధులు జెప్పుచున్నవి.
ఓరాజా ఏ ఫలము కొరకు బ్రాహ్మణుడు కర్మను చేయుచున్నాడో దానిని మేము తుదముట్టించుచున్నారము.
ఈ మంత్రము వలన భోక్తలు క్షత్రియ వైశ్యులుగా నున్నపుడే యసందర్భమును లేదు.
| 4. | ఇయంభూర్గయా ఏతేబ్రాహ్మణాగదాధరాః అనుచోటను"దేవతేదమన్నం కవ్యం బ్రాహ్మణ స్త్వాహవనీయార్ధే దత్తం అను చోటను దక్షిణేన బ్రాహ్మణంస్మృశస్ అనుచోటను ఉదాహరణములుగా బ్రాహ్మణ పదములు చెప్పబడినవి | |
శ్రీనివాసశర్మా అనియు శ్రీనివాసశర్మణం ఆనియు ఉదాహరణములుగా జెప్పినంత మాత్రముచేత అవే మంత్రములు కావు. గోవిందశర్మా అనవచ్చును రామవర్మా అనవచ్చును. అప్పుడు భోక్తలుగా గూర్చుండువారెవ్వరో అదిచూచి మార్చుకొనవచ్చును.