పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

యజమానస్య పితుః అని ప్రయోగములో వ్రాసినంత మాత్రముచేత తన భ్రాతకు తద్దినము పెట్టువాడు కూడను యజమానస్య పీతుః అనరాదు. ఆస్మద్భ్రాతుః ఆనవలెను. అలాగుననే దక్షిణేన బ్రాహ్మణం స్మృశన్ అనిన దానిచేత వైశ్యభోక్త ఉపవిష్ణుడైనప్పుడు మరియొక చోటనున్న బ్రాహ్మణుని ముట్టు కొనుమని అర్థముకాదు. భోక్తయగువాని దాకుమని యర్థము చేసికొనవలయును.

నాందీ శ్రాద్ధమునందు ఆభ్యుదయిక బ్రాహ్మణ భోజనాచ్ఛాదన ప్రత్యామ్నాయ యథాశక్తి హిరణ్యం తుభ్యమహం సంప్రదదేనమమ అనియున్నది. క్షత్రియవైశ్యో పనయనముల యందు బ్రాహ్మణులెట్లుగా సంభవింతురు. బ్రాహ్మణశబ్దము చెప్పుటచేత ఆయా వర్ణములవారికి ఎవ్వరాభ్యుదయికులగుదురో వారేయని అర్ధము చేయకతప్పదు.

ఈ పైన వ్రాయబడిన నాలుగు సిద్ధాంతముల వలన తేలిన పర్యవసితార్ధ మేమనగా

ఆబ్దికమంత్రములలో గొన్ని పరిషద్వందనాలతో సంబంధించి భోక్తలతో సంబంధించనందునను కొన్ని అనావశ్యకములు, అసందర్భములునగు శ్లోకములు జేర్చబడినందునను కొన్ని యుదాహరణ రూపకముగా ప్రయోగకారులు వ్రాసిన మాటలై నందునను బ్రాహ్మణ విప్రపదములు మాత్రము కానవచ్చునంత మాత్రముచేత క్షత్రియవైశ్యులు భోక్తలుగా నుండకూడదని చెప్పరాదు.