పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

"కాలే అధికార సిధ్యర్థం యధాశక్తి సంభవ ప్రాయశ్చిత్తం కరిష్యే" అని ప్రారంభించి శ్రార్ధమునకు బూర్వమే అధికారసిద్ధి కొరకు బ్రాహ్మణసభకు నమస్కారముచేయుట యావశ్యకము,

అది భోక్తలకు చేయు నమస్కారము కాదు గావున వాని యందు బ్రాహ్మణ విప్ర పదములున్న మాత్రమున క్షత్రియ, వైశ్యభోక్తలకు యెంతమాత్రమును సంబంధించదు. ఈ మంత్రములు ఎల్ల ప్రాయశ్చిత్తముల౦దు౦డ వచ్చును. శ్రాద్ధపూర్వాంగ ప్రాయశ్చిత్తమును తక్కిన ప్రాయశ్చిత్తముల వంటిదే. ఆ ప్రాయశ్చిత్తకాలమునందు భోక్తల పని యేమియులేదు. యాజక బ్రాహ్మణుడు కూడ వచ్చును.

2. "యదీచ్ఛసి మహారాజన్ ౼ సర్వతీర్ధావగాహనం
విప్రపాదవినిర్ముక్తంతోయం వెరసిధారయేత్"

ఈ శ్లోకమును భోక్తలకు పాద్యమిచ్చి యాజలమును శిరస్సున నుంచు కొనునప్పుడు పఠించుచున్నారు. ఇది ఆగ్నేయ పురాణములోని శ్లోకము. దీని యర్థము. ఓ రాజా నీవు సర్వతీర్ధములయందు స్నానముచేయ నిశ్చయించితివా విప్రపాదముల నుండి జారిన నీటిని శిరస్సున నుంచుకొనుము అని యున్నది. ఈ శ్లోకము భోక్తలపాడ్యకాలమున చదుపుటకంటె వెర్రి వేరేలేదు. భోక్తను ఎదుటనుంచుకొని, ఓ రాజాయని పిలుచుటయు మీకు సర్వతీర్ధావగాహనమందు ఇచ్ఛగలిగియున్నట్లైన, యనుటయు విప్రపాదతీర్ధమును శిరస్సున ధరించుకొమ్ము అనుటయు ఎంత ఆసందర్భముగానైన నున్నది కావున ఈ శ్లోకము అబ్దికమంత్రములో చేర్చరాదు.