పుట:శృంగారశాకుంతలము.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

శృంగారశాకుంతలము

     బులను, ఝంఝాపవనఝంపాసంపాతకంపమానకల్పాంతకాలజలధి
     ననుకరించు నరణ్యంబుఁ బ్రవేశించి వలయు వంకలం గాలువలలు
     [1]నురులు బోనులు దీమంబులు, జిగురుంగండెలు వెట్టి వేయించి సార
     మేయంబుల విడిపించిన.13
సీ. గళనాళములఁ ద్రుంచెఁ గారుపోతులఁ
                    గొన్ని తోలాడెఁ గొన్ని శార్దూలములను
     నెలుఁగులఁ గొన్ని మేనుల నఖంబుల వ్రచ్చె
                    జమరి మృగంబులఁ జంపెఁ గొన్ని
     కొఱప్రాణములఁ జేసి కూల్చె దుప్పులఁ గొన్ని
                    చెండెమన్నులఁ గొన్ని గుండెలవియ
     గఱచెఁ బందుల గొన్ని కంధరాంతరములు
                    కొండగొఱియల మన్నిగొనియెఁ గొన్ని
     చటులగతిఁ గొన్ని కణుజుల సంహరించె
     వెంటఁబడిఁ గొన్ని శరముల విత్తు [2]మాల్చెఁ
     గొన్నిజింకల ప్రేవులు గ్రుచ్చివైచెఁ
     గుక్క లాటవికంబులు నుక్కు మిగిలి.14
సీ. కడిమిమైఁ బిడియానఁ బొడిచి యొక్కఁడు కొఱ
                    ప్రాణంబుతోఁ బులిఁ బట్టి తెచ్చె
     భల్లాన నిర్గతప్రాణంబు గావించి
                    లావున నొక డేకలంబుఁ దెచ్చె
     నసిధార మెడద్రెవ్వ నడచి కొమ్ములతోన
                    నొకఁడు కార్పోతు మస్తకముఁ దెచ్చె
[3]బాణాభిహతిఁ గూలఁబడవేసి యొకఁడు
                    కాననదంతితొండంబు నఱకి దెచ్చె
తే. గుఱుచకుంతాన బెను మోర గ్రుచ్చి యెత్తి
     యెలుఁగు నొక్కఁడు కాల్వట్టి యీడ్చి తెచ్చె

  1. తెదలు
  2. మాన్చె
  3. బాణనిహతి