పుట:శృంగారశాకుంతలము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

39

     విఱువు కంఠాస్థుల నుఱికి చివ్వంగుల
                    మొత్తి మోదరలాడు మత్తకరుల
     గూల్పు ముర్వరఁ [1]దన్నికొన మన్నుఁబోతుల
                    వచ్చి వందఱలాడు వాహరిపుల
తే. జంపి వసియాడు శశములగుంపు కుఱికి
     చించి చెండాడుఁ గణుజులఁ జేతికొలది
     వెదకి వేఁటాడు దుప్పుల మెదలనీక
     చండవిక్రమచాప దుష్యంతభూప.11
క. అనుటయు మాండవ్యుని మన
     మునఁ గలిగిన భీతిఁ దెలసి భూపాలకుఁ డి
     ట్లను బ్రాహ్మణమిత్రునిఁ
     బాఱుని నే ని న్నకట యేమఱుదునే యెచటన్.12
వ. నీవు నావెంట నంటుకొని యొంటివడక తోడునీడయుంబోలెఁ నేతెమ్ము
     ప్రమాదంబు గాకుండఁ బ్రమోదంబుగా వేఁటవేడుక జూపి కుసుమంబు
     నుంబోలెఁ [2]గందకుండ నిన్నుం దెచ్చెదనని భుజం బప్పళించి మృగయ
     వర్గంబునుం దానును నిరర్గళప్రచారంబుల డాయనేఁగి [3]ప్రోగు వారించి
     దాపులమేపుల జువ్వులమొవ్వుల రేఁగులగోఁగుల రేలలజాలల వొద్దుల
     మద్దుల గురుగుల విరుగుల నెమ్ములజమ్ముల నేరేళ్ళమారేళ్ళఁ గలువల
     బలువులఁ గొడిసెల నొడి సెల నందుగుల నిందుగులఁ గలుగొట్లఁ గొట్లఁ బం
     చారుల నారులఁ బ్రేంకణంబుల గణంబులఁ గొండమామిళ్ళ వావిళ్ళ
     తాండ్లమాండ్ల జంద్రులనుంద్రుల వెలగలమొలగల బీరలగారల వేములఁ
     బ్రేముల మఱియునుం బెదబిచ్చి పినబిచ్చి నల్లిందనెల్లింద యిప్పకప్పు
     మద్ది గద్దగోరు గోరంట వెలమ యులిమిరి మూఁగవేఁగిస మొదలుగా
     బెక్కుతెఱంగుల మ్రాఁకులు మూఁకలుగొని యిసుము జల్లించిచల్లిన
     రాలని దట్టంబునం బొడకట్టు లేక పరిక్రీడమాన క్రోడ సింహ సైరిభ
     శరభ శార్దూల చమరు రురు కురంగాది జంతుఘోషంబులును, గంకకల
     వింక కడింజర ఖంజరీట కపోత శిఖావళ శుక పికానేక పక్షికుల కలకలం

  1. దన్నుకొక
  2. గసుగందకుండ
  3. పోగు