పుట:శృంగారశాకుంతలము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

శృంగారశాకుంతలము

     కారెనుపోతులును, గుహనావరాహంబుపై మోహంబున సమూహం
     బైన పందులును, గాని యేతన్మాత్రంబులు గావు. నాకుం బోవుట బుద్ధి
     గాదు, కాదని మగుడ నుద్యోగించిన మందకును దూరంబుగా వచ్చితిమి.
     [1]నడ గఁడు నడతెగె మానిసి మట్ట్ర చిట్టాడని యీ చిట్టడవి నెట్లు చన
     నేర్తు నొకయుపాయాంతరంబున దోడు వెట్టించుకొని[2]యెదం గాక
     యని యల్లనల్లన భూవల్లభుం జేరంజని యి ట్లనియె.8
సీ. కర్మకాండం బెఱుంగని పామరుండుఁ గా
                    ర్యాదిఁ జేకొని వినాయకునిఁ గొల్చు
     వేఁటమైఁదమి విఘ్నవిభుఁబ్రార్థనమ్ము సేయ
                    కయు వచ్చినారము గమనవేళ
     శరభశార్దూలాది చండసత్వంబుల
                    మర్దించుకొఱకునై మనదురాక
     మృగములు మనచేతఁ దగులువడంగ నం
                    దుల భీతి ప్రజలకుఁ గలుగకుండ
తే. గజముఖుని నేని బ్రార్థింతు ప్రజములోన
     బాలకును నేతి కుండ్రాల ప్రాల క చటి
     గొల్లలకుఁ జెప్ప నన్నుఁ దోడ్కొని చనంగ
     నంగజాలల ననువు ధరాధినాథ.9
క. సేమంబు పూని మృగజయ
     కామన సంకల్పపూర్వకముగ జపంబున్
     హోమముఁ జేయుచునుండెద
     సామజవదనునకుఁ దత్ప్రసాదము కలిమిన్.10
సీ. చిక్కుఁజీరుగ గూల్చు సింహపోతకములఁ
                    దోలి తొప్పఱలాడు గ్రోలుపులుల
     విలయంబు నొందించు విపినంబుపందుల
     వెరఁజి వెంపఱలాడు హరిణములను

  1. నడకయు నెడతెగె
  2. చనియెదంగాక