పుట:శృంగారశాకుంతలము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

37

     శరభనినాదవిప్రస్తంబులై గమ
                    నించు కంఠీరవనిక్వణంబుఁ
     గంఠీరవారవస్ఖలితంబులై చను
                    భీతవన్యకరీంద్రబృంహితమ్ము
తే. మక్కడింపఁ దదీయకల్మాషభీష
     ణోగ్రఘోషంబునను సత్వయూధవివిధ
     సత్వరధ్వానముల బహుజాతపక్షి
     కలకలంబులు వినవచ్చెఁ గర్ణములకు.5
క. ఆరావములుఁ గృతాంతా
     కారములై వేఁటకుక్క కదుపులు పెలుచం
     దారకులు పట్టి తిగువం
     గా రయమున మృగయులకు [1]మొగంబుల కెగయన్.6
గీ. సంతసంబందు నృపతియాస్యంబుఁ జూచి
     తిమురుకుక్కల బెడిదంపుఁ దెంపుఁ జూచి
     మృగయవర్గంబు గర్వంపుఁ బొగరుఁ జూచి
     యుల్లమునఁ జాల మాండవ్యుఁ డులుకు పుట్టి.7
వ. వనంబుఁ జేర వచ్చితిమి, మృగంబులు గానవచ్చుచున్నయవి, యీ
     వచ్చినవారిలోన నెవ్వరిని విచారించినం గాతరత్వంబు లేదు పోతరంబు
     బహులంబై యున్నది. ఏను [2]బేదబ్రాహ్మణుండ నివ్వనమృగంబుల నవ
     లోకించిన శరభస్వామి తలంపునంబడి పుట్టిన శరభంబులును, వైకుంఠ
     కంఠరవంబుమీఁది యుత్కంఠ నావిర్భవించిన సింగంబులును, జాంబ
     వంతుం డల్ల పనిసేయునప్పు డుప్పతిల్లిన భల్లూకంబులు, నాగ్రహంబున
     వ్యాఘ్రరక్షోభర్త లాక్షారుణాక్షంబుల నధిక్షేపించి చేయు నిక్షుచాప
     వ్యాపారంబున నుదయించిన పులులును, గుంభిదానవునకు సంభవంబైన
     యిభంబులును, గృతాంతుని లాయంబు లులాయంబుసంతతిం బ్రబలిన

  1. మృగంబుల
  2. వేద