పుట:శృంగారశాకుంతలము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

శృంగారశాకుంతలము

తే. భోగధీధైర్యకాంతులఁ బోల్పఁబోలుఁ
     గాని నాఁటిక నేఁడీడు గా రనంగ
     వెలసె వెన్నయయనుజుండు వినయధనుఁడు
     త్యాగశిబిరాజు చిల్లరనాగరాజు.39
క. ఆ నాగసచివధీమణి
     శ్రీనాయకుఁ డిందిరను వరించిన కరణి
     న్మానవతీతిలకముఁ బృథ్వీను
     తగతిఁ బోతమాంబ వివహంబయ్యెన్.40
ఉ. ఆ పురుషావతంసమున కా[1]సుచరిత్రకు నుద్భవించి రు
     ద్దీపితకీర్తి వెన్ననయు ధీనిధి మేడనయు న్సమస్తవి
     ద్యాపరమేష్టి యాదెనయు ధార్మికుఁ డెఱ్ఱనయు న్సుధానుస
     ల్లాపుఁడు వీరభద్రుఁడును లాలితనీతికళాధురంధరుల్.41
వ. ఇట్లు సమంచితదానవంచితకల్పతరుపంచకంబగు నా యమాత్యకుమార
     పంచకంబునందు.42
మ. కులపాథోనిధిపూర్ణచంద్రముఁడు దిక్కుంధీనహేలాకట
     స్థలనీరంధ్రమదప్రవాహలహరీచక్రాంగసత్కీర్తి కుం
     డలిరాట్కుండలపూజనారతుఁ డఖండశ్రీసమన్వితుఁడై
     వెలసెం జిల్లర వెన్నమంత్రి సకలోర్వీచక్రవాళంబునన్.43
క. వెన్నయ కూరిమి తమ్ముఁడు
     సన్నుతచరితుఁడు సమస్తజనసమ్మతుఁ డ
     త్యున్నతవాచావైభవ
     పన్నగపతి మేడ మంత్రి ప్రస్తుతి కెక్కెన్.44
ఉ. మేడన పేర్మినొందెఁ బుడమి న్నయసంపద దేవమంత్రితో
     నీడన యాచకావళి కభీష్టపుటీగుల కల్పశాఖికిం

  1. సుచరిత్రున కుద్భవించి