పుట:శృంగారశాకుంతలము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

11

     జోడన ధీజనస్తుతవచోవిభవంబున శేషచక్రి వాఁ
     దోడన సాటిగా నతనితోఁ బెఱమంత్రులు జాడు బేడనన్.45
శా. ఉన్నా రెన్నిక కెందఱే సచివు లత్యుచ్చోదరు ల్చాలసం
     పన్ను ల్వారలఁ గింపచానుల గణింపం బోరు వాగ్వైఖరు
     ల్మిన్ను ల్మోసి వెలుంగు సత్కవిజను ల్మేడయ్య వర్ణింతు రా
     వెన్నామాత్యు ననుంగుదమ్ముని జగద్విఖ్యాతచారిత్రునిన్.46
క. ఆతని యనుజన్ముండ[1]గు
     నాతఁడు బుధవిబుధతరువు నళినదళాక్షీ
     నూతనమదనుం డాదెన
     భూతలము యశఃపటీరమున వాసించెన్.47
ఉ. ఆది నృపప్రధాను లెనయౌదురు గాని సుధీగుణంబుల
     న్మేదిని నేఁటి వారి నుపమింప సమానులుగారు ధర్మ స
     మ్మోదికి సత్కళానివహమోహనవేదికి లోకహృన్ముదు
     త్పాదికి మిత్రభృత్యహితబంధువినోదికి మంత్రియాదికిన్.48
సీ. కులసమాగతధర్మగుణరక్షణమున
                    సీతాకాంతు రెండవ తమ్మునికిని
     నవికారనవమోహనాకారమునఁ
                    బురందరసూతి రెండవ తమ్మునికిని
     సన్నుతాశ్రాంతవిశ్రాణనంబున
                    బరేతస్వామి రెండవ తమ్మునికిని
     సుకృతసంధుక్షణాశోభితామలబుద్ధి
                    దశకంఠు రెండవ తమ్మునికిని
తే. ధరణి వెన్నయ్య రెండవ తమ్మునికిని
     సాటి యనవచ్చు నప[2]విల సద్గుణముల

  1. ధునాతన
  2. లీల