పుట:శృంగారశాకుంతలము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

9

     దా నొంది మంత్రి మేడన
     జానుగ భజియించె సప్తసంతానము[1]లన్.33
క. ఆ మేడన మంత్రికి సా
     ధ్వీమణి మాంచాంబకున్ శ్రుతిత్రయము గతి
     న్రామత్రయంబు పోలిక
     నాముష్యాయణులు గలిగి రనుపమతేజుల్.34
వ. అందు.35
శా. దుర్గాంభోధిగభీరు రూపజితచేతోజాతు నుద్యత్ప్రభా
     రుగ్ధాముం గరుణాభిరాము ధృతి మేరుక్ష్మాధరంబు న్సుధా
     దిగ్ధస్వాంతు నిశాంతదానసురపృథ్వీజాతము న్బాంధవ
     స్నిగ్ధుం జిల్లర యెఱ్ఱయ ప్రభుమణిం జెప్పందగుం బెంపునన్.36
శా. ఆయెఱ్ఱయ్యకుఁ గూర్మితమ్ముఁడగు వెన్నాఖ్యుండు ప్రఖ్యాతిగా
     మ్రోయించె న్బహుదేశభూవరసభామూర్ధంబులం దుల్లస
     త్సాయంకాలనటన్మహానటజటాసంఘాట[2]ధాటీవళ
     త్తోయస్ఫాలన ఫక్కికానఘయశస్తుత్తుంభనిర్ఘోషమున్.37
వ. తదనుసంభవుండు.38
సి. గౌతమ మునినాథుచేత నొప్పరి మేను
                    వికృతి నొందనినాఁడు వేల్పుఱేఁడుఁ
     బెండ్లిలో గిరిజాస్యబింబంబుఁ జూచుచో
                    దాల్మి వీఁడని నాఁడు తమ్మిచూలి
     కలశపయోరాశి చిలుకు కవ్వపుఁ
                    గమ్మకుంది కబ్బనినాఁడు మందరంబుఁ
     గాళికావిభుని డాకాలితాటింపులఁ
                    గమల బారనినాఁడు కుముదహితుఁడు

  1. లున్
  2. వాటీ