Jump to content

పుట:శృంగారనైషధము (1951).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

శృంగారనైషధము


క్కట తలఁగంగఁ జాలునొకొ కాలవిలంబము నాచరించి పి
మ్మటఁ దదభీప్సితార్థము సమర్పణ సేయు ప్రదాత యెమ్మెయిన్?

54


చ.

కమలము పంకసంకరవిగర్హితమర్మము గాదు నిల్వఁగాఁ
గమలకు నంచు నెంతయును గౌతుక మింపెసలాన నర్థిదోః
కమలము నిర్మలంబు నలిగాఢవివేకులు తద్విహారస
ద్మముగ నొనర్తు రప్రతిమదానకళాకలనాధురీణతన్.

55


ఉ.

దానకళాకలాపసముదంచితసారవివేకసంపదన్
మానితయాచమానజనమానసవృత్త్యభిపూర్తిబుద్ధి యె
వ్వానికి లే దొకింతయును వాఁ డొకరుండు భరంబు ధాత్రికిం
గానలు గావు శైలములు గావు పయోధులు గావు భారముల్.

56


తే.

[1]తలఁప నధమర్ణుఁ డొకఁడు ప్రదానపాత్ర
మిచట నొక్కటి గొని మీఁద నిచ్చు గోటి,
సుకృతసంపదఁ బారలౌకికకుసీద
మాసపడువారి కిదియ బేహార మరయ.

57


వ.

అని ముహూర్తమాత్రంబు చింతించి యానిషధరాజు ప్రసన్నముఖుండై యాబర్హిర్ముఖుల కిట్లనియె.

58


తే.

జన్యజనకంబులకు భేదశంక లేదు
దేహ మన్నజ మిందు సందేహ మెద్ది?
మీర లమృతాశు లమృతంబు మిమ్ముఁ జూడఁ
దృప్తిసంపదనొందె మద్వీక్షణములు.

59


తే.

ఏను చేసినపుణ్యంబు లెట్టివొక్కొ?
ఫలిత మయ్యెను మత్పూర్వపరమతపము

  1. ‘తలప నధమర్ణుఁ డొక్కప్రధానమాత్ర, మిచట నొక్కటి గొని' అని వ్రా.ప్ర.