పుట:శృంగారనైషధము (1951).pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

6


దీయని శ్రీనాథుఁడు సైత మిందలి యనౌచిత్యములఁ జూచి కంటగించుకొనెను. బుద్ధిపూర్వకముగ వానిని బరిహరించితి నని తానే చెప్పుకొనెను. చూడుఁడు హర్షుని నలగుణవర్ణనము:-

శ్లో. సాపీశ్వరే శృణ్వతి తద్గుణౌఘాన్ ప్రహస్య చేతో హరతో౽ర్ధశంభుః,
    అభూదవర్ణాంగుళిరుద్ధకర్ణా కదానకండూయనకైతవేన.

శ్లో. అలంసజన్ ధర్మవిధే విధాతా రుణద్ది మౌనస్యమిషేణ వాణీం,
    తత్కంఠమాలింగ్య రనన్య తృప్తాం న వేద తాం వేదజడః సవక్రాం.

శ్లో. శ్రియస్తదాలింగనభూర్నభూతా వ్రతక్షతః కాపి పతివ్రతాయాః,
    సమస్తభూతాత్మతయా నభూతం తద్భర్తురీర్ష్యాకలుషాణునాపి.

పైశ్లోకములలో రంభాద్యప్సరోభామినులేగాక త్రిమూర్తులభార్యలుసైతము నలునిగుణములను విని చాపలము వహించిరని యాతఁడు సూచించినాఁడు. జగన్మాతలకీదోషము నంటఁగట్టుట మిక్కిలియనుచిత మని దానిని బరిహరించి రంభావిషయమునుమాత్రము తా నిట్టులు తెలిఁగించెను.

శ్లో. అస్మత్కిలశ్రోత్రసుధాం విధాయ రంభాచిరంభామతులాం నలస్య,
    తత్రానురక్తా తమనాప్య భేజే తన్నామగంధాన్నలకూబరం సా.

చం. వినుకలి ......... వాసనన్".

హంస దమయంతియొద్ద నలుని వర్ణించునపుడు

శ్లో. సువర్ణశైలా.......... కీర్ణైః

అనుశ్లోకములోని "స్మరకేళికాలే” యనునసందర్భపదప్రయోగమును శ్రీనాథుఁడు పరిహరించుట లెస్స. అతని తెనుఁగిది.

గీ. కనకశైలంబు డిగ్గి .........వైశాఖ వేళలందు.