Jump to content

పుట:శృంగారనైషధము (1951).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5


శృంగారనైషధము

సంస్కృతవాఙ్మయమాంధ్రపరివర్తనముఁ బొందినచరిత్రములో మూఁడవస్థాభేదములు గలవు. మొదటిది కవిత్రయమువారు ప్రారంభించిన పురాణేతిహాసపరివర్తనపద్ధతి. నామమాత్రమున నివి పరివర్తనములు, గాని మూలకథ నాధారముగాఁ గొని వారు గావించిన స్వతంత్రరచనలు మూలముతోపాటు సమానకార్యములుగ నొప్పినవి. కొన్నిఘట్టములందు వారు మూలమునకు వన్నెచిన్నెలు దిద్దిరి. కావ్యకళాదృష్టిచే మూలమును దాఱుమాఱు చేసిరి. ఈస్వతంత్రపద్దతి మొదటిది. ఈ చరిత్రలోని రెండవయవస్థకు నైషధము తార్కాణము. ఇందు మూలానుసరణము తప్పలేదు. ముక్కకు ముక్కగాఁ దెలిఁగింపను లేదు. అనఁగా మూలవిధేయతయు స్వతంత్రతయు నను రెండుగుణములును గలిసినసంధి. ఈప్రక్రియకు నైషధమే మొదలు. మూఁడవపద్ధతి సంస్కృతనాటకములకు నేఁటితెలుఁగుసేఁత. ఇందు భాషాంతరీకర్తలు కేవలము మూలమునకు దాసులయిరి.

నైషధము సంస్కృతమున నెంతమహాకావ్యమైనను దత్కర్తయగు శ్రీహర్షుఁడు కాళిదాసాదులతోఁ బోల్పఁదగిన కవికాఁడు. అతఁడు మహాపండితుఁడు, శబ్ధార్థకల్పనాచాతురి గలవాఁడు. కాళిదాసభవభూతులకు లభించిన యుదాత్తకవితాతత్త్వ మీతనికి లేదు. శ్రీహర్షనైషధమును లోకము కొనియాడుట యిందలి పాండితీవిలసనమునకును గల్పనాచాతురికిని. ఈగ్రంథమున ననౌచిత్యదోషము దొరలినతావులును గలవు. స్త్రీవిషయమున నెట్టివర్ణనలనైనను జేయుటకు వెను