Jump to content

పుట:శృంగారనైషధము (1951).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

95


మున్నె నలునకు న న్నిచ్చుకొన్నదాన
నింక నొరునకు నెబ్భంగి నిత్తుఁ జెపుమ!

130


తే.

నలుని వరియింపఁగోరెడునాకు నిప్పు
డింద్రుపలుకు లయుక్తంబు లింపు గావు
కామసుఖములు నిర్వాణకామమతికిఁ
[1]గరము రచియింప కునికి యుక్తంబు గాదె?

131


మ.

ఇల వర్షంబులలోన భారతము భూయిష్ఠంబు నాల్గాశ్రమం
బులలోనన్ గృహమేధియాశ్రమమునుం బోలెం బయోజాక్షి యి
చ్చలఁ గావించెద భర్తృభక్తిగరిమన్ శర్మోర్మి కిమ్మీరని
ర్మలధర్మాగమమర్మనర్మసఖసమ్యక్కర్మకాండంబులన్.

132


ఉ.

శర్మమె కాని యివ్విబుధసద్మమునందుఁ దలంచి చూడఁగా
ధర్మము సేయలే దిచట ధర్మము సేయఁగ నిర్విశంకతన్
శర్మము నొందనుం గలదు శర్మము ధర్మముఁ గాంచుటొప్పునో
శర్మముఁ గాంచుటొప్పునొ? విచారము సేయుము నెమ్మనంబునన్.

133


క.

ఇందుండి యూర్ధ్వగతియును
నందుండి యధోగతియును నవసానమునన్
బొందును సజ్జనుఁ డిందును
నందును గలవాసి చూడుమా డెందమునన్.

134


ఉ.

ఆతత మైనకర్మగతి నాయువు వీడ్కోను నప్పు డాత్మలోఁ
గౌతుక మావహించునది గావున నాకసుఖం బపథ్య మా
పాతసుఖోన్ముఖుం డయినపంచజనుండు భజించు దానిఁ గా
మాతురితాతిరేకమున నార్యుల కింపవుఁ దత్ప్రకారముల్.

134
  1. ‘దలఁప రుచియింప వట్టిచందంబు గాఁగ' అని పా.