పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vii

గాక కేవల వర్తకవ్యాపారనిమగ్నులుగా నుండుకాలముననే యారంభదశలో శుకసప్తతిరచనము జరిగినట్లు పైపద్యము చెప్పుచున్నది. ఈ విషయమును పైకాలమునే స్థిరపఱచుచున్నది, కావున కదిరీపతికాలము పదునాఱవశతాబ్దమున నుత్తరార్ధ మని చెప్పఁదగును.

'శుకసప్తతి' యను పేరు సార్థకముగా నిందు డెబ్బదికథ లుండవలసినది. కాని ప్రస్తుతము లభించిన శుకసప్తతియందు ముప్పదికథలు మాత్రమే గలవు. ఈకథలలో పెద్దకథలును నుపకథలును గలవు. శుకసప్తతిలో నేఁడు పెద్దకథ లిరువదియొకటియు చిన్నకథలు తొమ్మిదియుఁ గలవు. ఉపలబ్ధము లగు తాళపత్రపుస్తకములయందును నేఁడు ముద్రితమైన నాలుగవ యాశ్వాసమునఁ గొంతభాగమువఱకును గన్పట్టుచున్నవి. ఇప్పటికీ నూఱేండ్లక్రిందటఁగూడ శుకసప్తతియందు ముప్పదికథలు మాత్రమే లభించినట్లును నీగ్రంథమునకు 'శుకత్రింశతి' అనుట సమంజసమనియు బ్రౌనుదొరవారు శుకసప్తతి గ్రంథమునకుఁ దాము దయారుచేయించిన శుధ్ధలిఖితప్రతియందు వ్రాయించి యున్నారు. ఈ వ్రాతప్రతి క్రీ. శ. 1931లో సంపుటీకరణము చేయఁబడి నేడు ప్రాచ్యలిఖితపుస్తకాగారమున నున్నది,

సంస్కృతమున శుకసప్తతి యరు గ్రంథము కలదు – అది యముద్రితము ఈ గ్రంథము తెలుఁగుగ్రంథమునకు కేవలమూలముగాదు. సంస్కృతమున కిది యనుకరణముగాని భాషాంతరీకరణము గాదని బ్రౌనుదొరవారి యభిప్రాయము.

కదిరీపతినాయకునకు నూఱేండ్లతరువాత నయ్యలరాజు నారాయణామాత్యుఁ డను కవి 'హంసవింశతి, యను ప్రబం